Uttar Pradesh : కొత్త పెళ్లికొడుకు నిర్వాకం..హనీమూన్ కోసం రూ.10 లక్షలు తేలేదని భార్య అసభ్యకర ఫొటోలతో బెదిరింపులు!

పెళ్లిలో కట్నమే కాదు హనీమూన్ వెళ్లటానికి కూడా అత్తింటివారు డబ్బులివ్వాలని పట్టుపట్టాడో కొత్త పెళ్లికొడుకు.

Uttar Pradesh : కొత్త పెళ్లికొడుకు నిర్వాకం..హనీమూన్ కోసం రూ.10 లక్షలు తేలేదని భార్య అసభ్యకర ఫొటోలతో బెదిరింపులు!

Groom demanded Rs.10 lakh

Groom demanded Rs.10 lakh : పెళ్లికే కాదు హనీమూన్ వెళ్లటానికి కూడా అత్తింటివారు డబ్బులివ్వాలని పట్టుపట్టాడో కొత్త పెళ్లికొడుకు. దాని కోసం రూ.10లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. కానీ అత్తింటివారు రూ.5లక్షలే ఇచ్చారు. కానీ అవి చాలవటం కొత్త పెళ్లికొడుకు గారికి. దీంతో సిగ్గుమాలిన పనికి దిగాడు. తన పరువు తానే తీసుకున్నాడు. తన భార్య పరువే తన పరువు అని కూడా చూడకుండా భార్యను అసభ్యకరంగా ఫోటోలు తీసి బెదిరింపులకు దిగాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూకు చెందిన యువకుడు ఫిలిబిత్‌కు చెందిన యువతిని ఫిబ్రవరి (2023)లో వివాహం చేసుకున్నాడు. పెళ్లికి అత్తింటివారు కట్నం బాగానే ఇచ్చారు. నగలు, నగదు, విలువైన వస్తువులు బాగానే ముట్టచెప్పారు. పెళ్లి అయి మూడు నెలలు కూడా అవ్వకుండానే భార్యను వేధించటం మొదలుపెట్టాడు. పెళ్లి జరిగిన మరునాటి నుంచే మన హనీమూన్ వెళదాం. మీ పుట్టింటినుంచి రూ.10లక్షలు తీసుకురావాలని వేధించటం ప్రారంభించాడు. దాంతో ఆమె బాధపడింది. మూడు నెలలు జరిగినా మొదటిరాత్రి కూడా జరగలేదు. ఈ విషయం తెలిసిన ఆమె పుట్టింటివారు కొత్త పెళ్లికొడుకుని ప్రశ్నించారు.

దానికి అతను అదే సమాధానం చెప్పాడు. తనకు రూ. 10 లక్షలు ఇస్తేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని..అక్కడే మొదటిరాత్రి అని లేదంటే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు రూ. 5 లక్షలు ఇచ్చారు. డబ్బు అందుకున్నాక మే 7న భార్యను హనీమూన్ కోసం నైనిటాల్ తీసుకెళ్లాడు. అక్కడ భార్య అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. మిగతా రూ. 5 లక్షలు ఇవ్వాలని..ఇవ్వకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అత్తగారిని విషయం చెప్పింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆమె మే13న పుట్టింటికి వచ్చేసింది. భర్తతో పాటు అత్తంటివారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.