Jewellery Showroom: నగల షోరూమ్ ఓనర్‌ను బంధించి మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లిన ఉద్యోగులు

నగల షో రూమ్‌లో పని చేసే ఉద్యోగులే ఓనర్‌ను బంధించి నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్, అహ్మదాబాద్‌లో ఆదివారం వేకువఝామున జరిగింది.

Jewellery Showroom: నగల షోరూమ్ ఓనర్‌ను బంధించి మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లిన ఉద్యోగులు

Jewellery Showroom: గుజరాత్‌లో బంగారు నగల షోరూమ్‌లో ఉద్యోగులే దొంగతనానికి పాల్పడ్డారు. అది కూడా ఓనర్‌ను బంధించి నగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో మహేష్ షా అనే వ్యక్తి అంజలి జువెలర్స్ పేరుతో ఒక నగల షోరూమ్ నిర్వహిస్తున్నాడు.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

శనివారం ధన్‌తేరాస్ సందర్భంగా కస్టమర్లు అధిక సంఖ్యలో బంగారం కొనేందుకు వచ్చారు. దీంతో కొనుగోళ్లు పూర్తయ్యే సరికి రాత్రైంది. ఈ క్రమంలో లావాదేవీలు, కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ చూసేందుకు ఆదివారం వేకువఝాము వరకు సమయం పట్టింది. అన్ని వివరాలు పూర్తయ్యాక నగల్ని స్ట్రాంగ్ రూములో పెట్టేందుకు ఓనర్ మహేశ్ షా, తన షో రూమ్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగుల్ని తీసుకెళ్లాడు. స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లగానే, వాళ్లు ఓనర్‌ను బంధించి తాళం వేశారు. అనంతరం అక్కడ్నుంచి మూడు కేజీల విలువైన బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు. లోపల ఉన్న ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Kerala Student: తల్లి కోసం తనయుడి అద్భుతం.. ఇంటి పనుల్లో సాయం చేసేందుకు రోబో రూపొందించిన కుర్రాడు

అయితే, వారు వచ్చేలోగానే నిందితులు ఇద్దరూ నగలతో పారిపోయారు. పోలీసులు వచ్చి స్ట్రాంగ్ రూములో ఉన్న ఓనర్‌ను విడిపించారు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.