Kerala Student: తల్లి కోసం తనయుడి అద్భుతం.. ఇంటి పనుల్లో సాయం చేసేందుకు రోబో రూపొందించిన కుర్రాడు

తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసేందుకు ఒక రోబో తయారు చేశాడు తనయుడు. స్కూలు ప్రాజెక్టులో భాగంగా తయారు చేసిన ఈ రోబో ఇంట్లో ఆహారం అందించడం, న్యూస్ పేపర్ తేవడం వంటి పనులు చేస్తోంది.

Kerala Student: తల్లి కోసం తనయుడి అద్భుతం.. ఇంటి పనుల్లో సాయం చేసేందుకు రోబో రూపొందించిన కుర్రాడు

Kerala Student: తన తల్లి ఇంటి పనుల కోసం ఎక్కువ కష్ట పడటం కోసం చూసిన కొడుకు ఆమె కోసం ఒక రోబోను తయారు చేశాడు. ‘పాతూటి’ పేరుతో ఈ రోబోను రూపొందించాడు. కేరళ, కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రాంతానికి చెందిన వెంజెడ్ అనే గ్రామంలో మొహమ్మద్ షియాద్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Missing Indians: కెన్యాలో కనిపించకుండా పోయిన భారతీయుల హత్య… నివేదికలో వెల్లడి

తన స్కూల్ ప్రాజెక్టులో భాగంగా షియాద్ ఒక రోబోను తయారు చేశాడు. అయితే, ఈ రోబో తన తల్లికి ఇంటి పనుల్లో ఉపయోగపడాలనుకున్నాడు. అలా తన స్నేహితుడు అర్జున్ సహాయంతో రోబోను తయారు చేశాడు. దీని కోసం అతడు ఎమ్ఐటీ యాప్, ఆండ్రాయిడ్, అడ్మెగా కంట్రోలర్ వంటివి వాడాడు. అలాగే ప్లాస్టిక్ స్టూల్, అల్యూమినియమ్ షీట్, ఫిమేల్ డమ్మీ, సర్వింగ్ ప్లేట్ వంటి మెటీరియల్స్‌తో రోబోను తయారు చేశాడు. అల్ట్రాసోనిక్ సెన్సర్‌తో ఈ రోబో పని చేస్తుంది. ఇది ఆటోమేటిక్, మ్యానువల్.. రెండు మోడ్‌లలో పని చేస్తుంది. ఈ రోబో ఐదు నుంచి ఆరు కేజీల బరువు మోయగలదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గంలో ఈ రోబో ప్రయాణిస్తుంది.

Rohit Sharma: జాతీయ గీతం సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ.. నెటిజన్ల ప్రశంసలు

ప్రస్తుతం ఈ రోబో తన తల్లికి కొంత భారమైనా తగ్గించిందని షియాద్ అన్నాడు. ఈ రోబో ఆహారం అందించడం, న్యూస్ పేపర్ తీసుకు రావడం వంటి ఇంటి పనులు చేస్తోంది. ఈ రోబో తయారీకి రూ.10,000 ఖర్చైనట్లు చెప్పాడు. ప్రస్తుతం తన ఇంటిలోని రోబోను చూసేందుకు చాలా మంది ఇంటికి వస్తున్నట్లు, ఈ విషయంలో ఆనందంగా ఉన్నట్లు చెప్పాడు.