Missing Indians: కెన్యాలో కనిపించకుండా పోయిన భారతీయుల హత్య… నివేదికలో వెల్లడి

గత జూలైలో కెన్యాలో ఇద్దరు భారతీయులు కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యంపై స్పందించిన కోర్టు, విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరినీ దుండగులు హత్య చేసినట్లు విచారణ బృందం తేల్చింది.

Missing Indians: కెన్యాలో కనిపించకుండా పోయిన భారతీయుల హత్య… నివేదికలో వెల్లడి

Missing Indians: కెన్యాలో గత జూలైలో కనిపించకుండా పోయిన ఇద్దరు భారతీయులు హత్యకు గురైనట్లు తాజా నివేదిక వెల్లడించింది. కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటోకు సన్నిహితులైన ఇద్దరు భారతీయులు జుల్ఫికర్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ జైద్ సమి కిద్వా హత్యకు గురైనట్లు ఈ నివేదిక తేల్చింది.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

వీరిద్దరూ అధ్యక్షుడు రూటోకు డిజిటల్ ప్రచార టీమ్‌లో కీలకంగా వ్యవహరించేవారు. జుల్ఫికర్ బాలాజీ టెలిఫిలింస్ సంస్థకు సీఓఓగా కూడా పనిచేశారు. ఎరోస్ నౌ వంటి సంస్థలో కూడా కీలకంగా పనిచేశారు. ఇక రూటో అధ్యక్షుడిగా గెలవడంలో జుల్ఫికర్, మొహమ్మద్ జైద్ పాత్ర ఎంతో ఉంది. జుల్ఫికర్, మొహమ్మద్ జైద్ సమీ.. రూటో డిజిటల్ ప్రచార బాధ్యతలు తీసుకుని సమర్ధంగా నిర్వహించారు. అయితే, గత జూలై నుంచి వీరు కనిపించకుండా పోయారు. అప్పట్లో వీరిపై మిస్సింగ్ కేసు నమోదైంది. తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది.

Rohit Sharma: జాతీయ గీతం సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ.. నెటిజన్ల ప్రశంసలు

దీంతో కోర్టు వీరిద్దరి మిస్సింగ్ గురించి తేల్చేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణ జరిపి, తాజా నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఈ ఇద్దరినీ ఒక తిరుగుబాటు బృందం హత్య చేసింది. ఈ విషయాన్ని బృందం ప్రభుత్వానికి నివేదించింది. కాగా, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా రూటో అధికారులను ఆదేశించారు.