Jobs Fraud : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో విశాఖలో భారీ మోసం, నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు

Jobs Fraud :

Jobs Fraud : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో విశాఖలో భారీ మోసం, నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు

Jobs Fraud

Jobs Fraud : ఉద్యోగాల పేరుతో విశాఖలో భారీ మోసం వెలుగుచూసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు తులసీరామ్. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, జీఎస్టీ, హెచ్ పీసీఎల్, కస్టమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిలువునా ముంచాడు. నకిలీ జాయినింగ్ లెటర్లు ఇచ్చి యువతను చీట్ చేశాడు.

తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. తులసీరామ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తులసీరామ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read..Job Fraud : ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ముఠా గుట్టు రట్టు

విశాఖ వేదికగా నిరుద్యోగులే టార్గెట్ గా రెచ్చిపోయిన కేటుగాడి బాగోతం బట్టబయలైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను ఊరించాడు. పలు కేంద్ర సంస్థల్లో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన నిరుద్యోగులు అడ్డంగా మోసపోయారు. ఉద్యోగాలే కాదు డిగ్రీ పట్టాలు కూడా ఇప్పిస్తానని మోసం చేశాడు తులసీరామ్. తులసీరామ్ చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తులసీరామ్ ఇదంతా పక్కా పథకం ప్రకారమే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

పరారీలో ఉన్న కేటుగాడు తులసీరామ్ ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. తులసీరామ్ ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. డిగ్రీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన తులసీరామ్.. దోచుకున్న డబ్బుతో పరార్ అయ్యాడు.