Job Fraud : ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ముఠా గుట్టు రట్టు

Job Fraud: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ జాబ్స్ ఇపిస్తామని మోసం చేస్తున్నారు. రూ.50 లక్షల అమౌంట్ ఫ్రాడ్ చేశారు.

Job Fraud : ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ముఠా గుట్టు రట్టు

Job Fraud(Photo : Google)

Job Fraud : అన్ని అర్హతలు ఉన్నా జాబ్ లేని నిరుద్యోగులు ఎందరో. బాగా చదువుకున్నా ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలామంది నిరుద్యోగులు.. జాబ్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక కొలువు దొరికితే చాలు అనే ఫీలింగ్ తో ఉన్నారు. సరిగ్గా అలాంటి వారి వీక్ నెస్ ను కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.

జాబ్స్ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులను నిలువునా దోచుకుంటున్నారు. దొరికినంత దోచుకుని అడ్రస్ లేకుండా పోతున్నారు. తాము మోసపోయామని నిరుద్యోగులు తెలుసుకునేలోపు కేటుగాళ్లు లక్షలు, కోట్ల రూపాయలతో ఎస్కేప్ అవుతున్నారు. తాజాగా జాబ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న (జాబ్ ప్రాడ్) కాల్ సెంటర్ ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సైబర్ క్రైమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 18మంది టెలికాలర్లు, ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మాటలకు మోసపోయిన బాధితుల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు.

Also Read..Apple Employee Fraud : రూ. 138 కోట్లు కాజేసిన ఆపిల్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష.. కొల్లగొట్టిన మొత్తం కంపెనీకి చెల్లించాల్సిందే..!

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న(జాబ్ ఫ్రాడ్) కాల్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీసీపీ స్నేహా మిశ్రా తెలిపారు. మొత్తం 32మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో టెలికాలర్లు, ముగ్గురు నిర్వాహాకులు ఉన్నట్లు వెల్లడించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేటకు చెందిన నిర్వాహాకులు గడగొని చక్రధర్ గౌడ్, గణేష్, శ్రావణ్ లను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.

”ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో డిగ్రీ చదివాడు. తర్వాత పలు సంస్థల్లో మార్కెటింగ్ చేశాడు. కాల్ సెంటర్ నడపడానికి 100 మొబైల్స్, 148 పైగా సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ కి లింక్ చేశారు. నిరుద్యోగులకు డేటా ఎంట్రీ జాబ్స్ ఇపిస్తామని మోసం చేస్తున్నారు. రూ.50 లక్షల అమౌంట్ ఫ్రాడ్ చేశారు.

4 రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉంటే.. ఇద్దరు మాత్రమే సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులు 45 రోజులు కాల్ సెంటర్ నడిపి మూసేశారు. మళ్లీ 45 రోజుల తర్వాత రీఓపెన్ చేసి కాల్ సెంటర్ కొనసాగిస్తున్నారు. 14 ల్యాప్ టాప్స్, 148 సెల్ ఫోన్లు, లక్షా 35వేల రూపాయల, 4 బైక్ లు, బీఎండబ్ల్యూ కార్ సీజ్ చేశాము. పంజాగుట్టలో నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ను సీజ్ చేశాం. నిందితులకు ఎలాంటి రాజకీయ పార్టీల నేతలతో సంబంధం లేదు” అని డీసీపీ స్నేహా మిశ్రా కేసు వివరాలు వెల్లడించారు.

Also Read..Madhya Pradesh : భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లనివ్వలేదని భార్య ఆత్మహత్య

పైసా పెట్టుబడి లేదు. నిరుద్యోగుల వీక్ నెస్ వారికి ఇన్వెస్ట్ మెంట్. మాటలతో మాయ చేస్తారు. జాబ్స్ పేరుతో ఊరిస్తారు. ఇంట్లో ఉంటూనే నెలకు వేల రూపాయలు సంపాదించుకోవచ్చని ఆశపెడ్తారు. ముందుగా నామమాత్రంగా కొంత అమౌంట్ చెల్లించాలని కండీషన్ పెడ్తారు. పెద్ద అమౌంట్ కాకపోవడంతో నిరుద్యోగులు ఆ డబ్బు చెల్లించేందుకు రెడీ అవుతారు. అలా వేలాది మందిని అట్రాక్ట్ చేస్తారు. వారందరితో డబ్బు కట్టించుకుంటారు. లక్షల డబ్బులు పోగేస్తారు. చివరికి ఆ డబ్బుతో చెక్కేస్తారు. జాబ్స్ పేరుతో అనేక మోసాలు జరిగాయి. జరుగుతున్నాయి. జాబ్స్ ఫ్రాడ్ గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. నకిలీ ప్రకటనలకు మోసపోతూనే ఉన్నారు.