Husband Eloped : కుటుంబ కలహాలు-భర్త అదృశ్యం

కుటుంబ కలహాలతో ఒక భర్త ఇంట్లోంచి పారిపోయాడు. వారం రోజులైనా అతని ఆచూకి లభించకపోయే  సరికి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Husband Eloped : కుటుంబ కలహాలు-భర్త అదృశ్యం

Husband Eloped

Updated On : November 21, 2021 / 8:27 AM IST

Husband Eloped :  కుటుంబ కలహాలతో ఒక భర్త ఇంట్లోంచి పారిపోయాడు. వారం రోజులైనా అతని ఆచూకి లభించకపోయే  సరికి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ జీడిమెట్ల  పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో ప్రభాకరాచారి(38) స్వాతి దంపతులు నివసిస్తున్నారు.  వారికి ఇద్దరు సంతానం. ప్రైవేట్ జాబ్ చేసే ప్రభాకరాచారికి తాగుడు అలవాటు ఉంది. ఈ విషయంగా ఇద్దరిమధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి.

Also Read : Young Woman Died : విహారంలో విషాదం-కారులోంచి తల బయటపెట్టటంతో ప్రాణమే పోయింది

కాగా ….తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఇటీవల స్వాతి తల్లి దగ్గరకు లాలాపేట వెళ్లింది. తిరిగి 14వ తేదీ ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో సామానులు ఏమీ కనిపించలేదు. భర్తను అడగ్గా… తానే అమ్మేశానని చెప్పాడు. దీంతో ఇద్దరి  మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో 15వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ప్రభాకరాచారి తన మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయాడు.

రాత్రి ఎంతసేపటికి  ఇంటికి  రాకపోయేసరికి భర్త ఫోన్ కు   కాల్ చేయగా అది ఇంట్లోనే ఉంది. తెలిసిన స్నేహితులు, బందువుల ఇళ్లలో విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడి భార్య జీడిమెట్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.