Dowry Harassment : అదనపు కట్నం తీసుకురా… లేదంటే నా ఫ్రెండ్ తో గడుపు…
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

Dowry Harassment
Dowry Harassment : జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
శంషాబాద్ కు చెందిన ఓ వ్యాపారి (35) 2016 లో మహిళ (27)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అత్తవారి వద్దనుంచి రూ.5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు, లక్షల విలువైన ఇతరత్రా గృహోపకరణాలు లాంఛనంగా తీసుకున్నాడు. పెళ్లనై కొన్నాళ్లకు చేస్తున్న వ్యాపారం మూసేశాడు. జులాయిగా తిరగటం మొదలెట్టాడు.
చేతిలో చిల్లి గవ్వలేక భార్యను పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకు రమ్మని వేధించ సాగాడు. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో భార్యా భర్తలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను ఆమెకు తెలియకుండా రికార్డు చేసి సోషల్ మీడియాలో స్నేహితునికి పంపించాడు. ఆసంగతి తెలిసిన మహిళ భర్తను నిలదీసింది.
అదనపు కట్నం తీసుకురా…. లేదంటే నా స్నేహితుడితో ఏకాంతంగా గడుపు అంటూ భార్యను ఒత్తిడి చేశాడు. భర్త పెట్టే టార్చర్ భరించలేక అత్త మామలకు విషయం చెప్పింది. వారు కూడా తమ కొడుక్కే సపోర్టు చేసి అదనపు కట్నం తెమ్మని ఒత్తిడి చేశారు. పైగా వారు ఆమెపై చేయి చేసుకోవటంతో ఆదివారం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్త, అత్త మామలతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Secunderabad Riots Case : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 16 మంది నిందితులకు బెయిల్ మంజూరు