Family Dispute : విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త | Family Dispute

Family Dispute : విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. గతంలో విడాకులు తీసుకుని.... మళ్లీ భార్యను ఇంటికి తెచ్చుకుని

Family Dispute : విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త

Family Dispute : హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. గతంలో విడాకులు తీసుకుని…. మళ్లీ భార్యను ఇంటికి తెచ్చుకుని హత్య చేశాడా భర్త.

రాజేంద్ర‌నగర్‌లోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రిన్, పర్వేజ్‌లు భార్యా భర్తలు, 14 ఏళ్ల క్రితం వారిద్దరికీ పెళ్ళయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ పర్వేజ్,  సమ్రిన్ ల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.  గొడవలతో గతంలో విడాకులు తీసుకున్నారు.

Also Read : One Wife, Two Husbands : ఇద్దరు పిల్లల తల్లి-ఇద్దరు భర్తల భార్య- పెళ్ళాం కోసం భర్తల గొడవ

అయితే ఏడాది క్రితం పెద్దమనుషుల  ద్వారా భార్య సమ్రిన్‌కు నచ్చచెప్పించి…మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. గురువారం రాత్రి మళ్లీ భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో పర్వేజ్, భార్య సమ్రిన్‌ను కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. అనంతర పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

×