Karimnagar : కారు నడిపింది 14 ఏళ్ల మైనర్.. బ్రేక్‌‌కు బదులు క్లచ్ తొక్కడంతో ప్రమాదం

రీంనగర్ కమాన్ చౌరస్తా నుంచి ప్రమాద ఘటనాస్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు...కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Karimnagar : కారు నడిపింది 14 ఏళ్ల మైనర్.. బ్రేక్‌‌కు బదులు క్లచ్ తొక్కడంతో ప్రమాదం

Karimnagar

Updated On : January 30, 2022 / 2:05 PM IST

Karimnagar Car Accident : కారు స్టీరింగ్ పట్టుకున్నారంటే చాలు.. రయ్‌ మని దూసుకెళ్లాల్సిందే… స్పీడ్‌ లిమిట్స్… రోడ్ రూల్స్…లాంటివి వాళ్లకు పట్టవు. అతి వేగానికి పోలీసులు వరుస పెట్టి చలానాలు వేసినా.. వాళ్ల తీరు మారదు.. నిబంధనలు పాటించని కారణంగా పోలీసులు ఇప్పటి వరకూ వేల రూపాయల ఫైన్ వేశారు కదా.. ఇకపైనా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని కారు నడుపుదామన్న కనీస జ్ఞానం కూడా ఉండదు. ఎవరు చస్తే మాకేంటి.. అనుకునే వాళ్లు కొందరుంటారు. వాళ్లే అతివేగంతో జనం ప్రాణాలు తీస్తూ ఉంటారు…కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనలో కూలీనాలీ చేసుకుని రోడ్డుపక్కన బతికే పేదల జీవితాలు ఛిద్రమయ్యాయి. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Read More : Minister Harish Rao: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 500లీ.ల ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్

మృతులు సీత, జ్యోతి, రాణి, లలితగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన TS02EY2121 నెంబర్ గల కారుపై 7 ఓవర్ స్పీడ్ జరిమానాలు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ ఉంది. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి.  కారు యజమాని రాజేంద్రప్రసాద్ కొడుకు వర్దన్ కారు నడిపాడినట్లు, ఇతనికి 14 ఏళ్లు మాత్రమే ఉంటాయని నిర్ధారించారు. సరిగా డ్రైవింగ్ రాకపోవడంతో.. ప్రమాదం జరిగిందని అర్థమౌతోంది. వర్దన్ తో పాటూ మరో ఇద్దరూ మైనర్లు కారులో ఉన్నట్లు సమాచారం. బ్రేక్ కు బదులు.. క్లచ్ తొక్కడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్..కొడుకు వర్దన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నారు.

Read More : Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని

కరీంనగర్ కమాన్ చౌరస్తా నుంచి ప్రమాద ఘటనాస్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు…కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి రాజకీయ పార్టీలు ధర్నా నిర్వహిస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్షించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి గంగుల కమలాకర్ రానున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.