Banjara Hills Land : నగరంలో సీమ గ్యాంగ్ ? కబ్జాకు వెళ్లలేదు.. ఈవెంట్ కోసం వెళ్లారు – విశ్వప్రసాద్

బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ అమెరికా నుంచి వీడియో ద్వారా వివరణనిచ్చారు. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇందులో టీజీ వెంకటేశ్ కు...

Banjara Hills Land : నగరంలో సీమ గ్యాంగ్ ? కబ్జాకు వెళ్లలేదు.. ఈవెంట్ కోసం వెళ్లారు – విశ్వప్రసాద్

Kabja

Land Grab In Banjara Hills : బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ అమెరికా నుంచి వీడియో ద్వారా వివరణనిచ్చారు. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇందులో టీజీ వెంకటేశ్ కు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ల్యాండ్ తమదేనని, వేరే వాళ్లు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బంజారాహిల్స్ లో క్లియర్ టైటిల్ తో ఉన్న.. 2200 yards స్థలం ఒకటి ఉందని, ఇందులో 25 శాతం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగతా స్థలం ఆక్రమణకు గురవుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ జరిగినప్పటి నుంచి భూమి విషయంలో వివాదం కొనసాగుతూ వస్తోందని విశ్వప్రసాద్ తెలిపారు. ల్యాండ్ డెవలప్ మెంట్ కు వెళితే.. తన భూమికి ఆనుకుని ఉన్న ఏపీ జేమ్స్ ల్యాండ్ ఉందని.. అయితే ఆ ఆస్థిని ఈడీ జప్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఆ ల్యాండ్ ఏ సబ్బర్బన్ కంపెనీ తీసుకుని..ఆనుకుని ఉన్న తమ ల్యాండ్ ను కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తోందని వీడియోలో ఆరోపించారు. ఈ ల్యాండ్ విషయంలో వివాదం కొనసాగుతుండడంతో కోర్టుకు వెళ్లామని, ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అన్నీ అనుమతులు తీసుకుని.. కోర్డు ఆర్డర్ తర్వాత డెవలప్ మెంట్ కోసం వెళితే.. ఓ గ్రూపు అడ్డుకొనే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. అన్నీ పత్రాలు, కోర్డు ఆర్డర్స్ ఉన్నా.. పోలీసులు మాత్రం తమకు వ్యతిరేకంగా FIR నమోదు చేశారని తెలిపారు. రెండు సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీ ఎలాంటి ఆధారాలు చూపించలేదని, తమ ల్యాండ్ ను కబ్జా చేసే అవసరం ఏంటీ అని ఆయన ప్రశ్నించారు.

Read More : Banjarahills Police : బంజారాహిల్స్ పీఎస్‌‌కు కొత్త సీఐ.. ఈయన ఎవరు ?

బంజారాహిల్స్ కబ్జా కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు 75 నుంచి 80 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు… కీలక నిందితులు పారిపోతుంటే చూస్తూ చోద్యం చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి కస్టడీ నుంచి ఇద్దరు పరారయ్యారు. ఈ కేసులో A3, A4లుగా ఉన్న సుభాష్‌ పులిశెట్టి, మిధున్‌ అల్లుల పరారయ్యారు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మిగతా వారి కోసం గాలిస్తున్న సమయంలోనే కస్టడీలో ఉన్న వాళ్లు తప్పించుకోవడం.. పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఇంత సంచలనమైన కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. లేక కొందరు సిబ్బంది నిందితులకు సాయం చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Read More : Hyderabad : బంజారా హిల్స్ కబ్జా స్ధలం.. కధా కమామీషు

హైదరాబాద్‌లో రాయలసీమ ముఠా హల్‌చల్‌ చేసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం-10లో ఖరీదైన స్థలం ఆక్రమణకు ప్రయత్నించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత సోదరుడు.. ఆదోనికి చెందిన 90 మంది రౌడీలతో 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమణకు ప్రయత్నించాడు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో 32 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతావారు పరారయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీజీ వెంకటేశ్ కుమారుడి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. కోట్ల విలువచేసే ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు స్కెచ్‌ ఎవరిదన్న దానిపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. ల్యాండ్ కబ్జా యత్నం వెనుక మాస్టర్‌ మైండ్‌ ఎవరిదన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 32మంది సీమ రౌడీలను విచారించారు. వారిచ్చిన సమాచారంతో ఓ అంచనాకు వచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎంపి టీజీ వెంకటేశ్‌ సోదరుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే భూ కబ్జాకు యత్నించాడా.. మరెవరి హస్తమైందా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమాన్‌ జయంతి రోజున పోలీసులంతా శోభాయాత్ర డ్యూటీస్‌లో ఉన్నారు. ఇది ముందే ఊహించిన ఫ్యాక్షన్‌ ముఠా.. వందకోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. పోలీసులు శోభాయాత్ర విధుల్లో ఉన్నారని తెలుసుకుని… రాయలసీమ రౌడీ బ్యాచ్‌ను దించి.. ల్యాండ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.