Man push-ups on roof of moving car : కదిలే కారుపై పుష్ అప్స్ కొట్టాడు.. పోలీసులు ఏం చేశారో చూడండి!

కదిలే కారుపై పుష్ అప్స్ కొట్టిన యూపీ వ్యక్తికి పోలీసులు చలాన్ వేశారు. రోడ్డుపై కారు నడుపుతూనే లోపలి నుంచి పై రూఫ్ ఎక్కాడు. ఉజ్వల్ యాదవ్ అనే వ్యక్తి కదులుతున్న కారుపై పడుకుని డేంజరస్ పుష్ అప్ప్ కొట్టాడు.

Man push-ups on roof of moving car : కదిలే కారుపై పుష్ అప్స్ కొట్టాడు.. పోలీసులు ఏం చేశారో చూడండి!

Man Does Push Ups On Roof Of Moving Car In Viral Video

Man push-ups on roof of moving car : సోషల్ మీడియా స్టార్ డమ్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు. ఈ ప్రయత్నాల్లో తమ ప్రాణాలు కోల్పోడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. కదిలే కారుపై పుష్ అప్స్ కొట్టిన యూపీ వ్యక్తికి పోలీసులు చలాన్ వేశారు. రోడ్డుపై కారు నడుపుతూనే లోపలి నుంచి పై రూఫ్ ఎక్కాడు. ఉజ్వల్ యాదవ్ అనే వ్యక్తి కదులుతున్న కారుపై పడుకుని డేంజరస్ పుష్ అప్ప్ కొట్టాడు.

ఇదంతా వీడియో కూడా రికార్డు చేయించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో కాస్తా యూపీ పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే యూపీ పోలీసులు ఈ డేంజరస్ స్టంట్ చేసిన ఉజ్వల్ యువకుడికి జరిమానా విధించారు. అలాగే కారుపై పుష్ అప్స్ కొడుతున్న వీడియోను యూపీ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కొన్ని పుష్ అప్స్ మాత్రమే అందరి దృష్టికి తీసుకెళ్లగలవు. స్టే స్ట్రాంగ్.. స్టే సేఫ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.

కదిలే కారు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన ఉజ్వల్ పైకి ఎక్కి పుష్ అప్స్ చేశాడు. పోలీసులు చలాన్ చెల్లించిన ఉజ్వల్ క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి డేంజరస్ స్టంట్లు ఎప్పుడూ చేయననని అన్నాడు. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి డేంజరస్ స్టంట్లు చేసినా అది చట్టం రీత్యా నేరం.. అలాంటి చర్యలు మీ ప్రాణాలు తీయొచ్చు లేదా ఇతరుల ప్రాణాలు బలితీసుకోవచ్చు.

ఇలాంటి పనులు మరెప్పుడూ చేయొద్దని యూపీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. యూపీ పోలీసులు పోస్టు చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో 61వేల వ్యూస్ వచ్చాయి. యూపీ పోలీసులను నెటిజన్లంతా ప్రశసంలతో ముంచెత్తుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..