Man Shoots Girl : దారుణం.. ప్రేమించలేదని టెన్త్ క్లాస్ బాలికను తుపాకీతో కాల్చిన ప్రేమోన్మాది
ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీస్తున్నారు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది టెన్త్ క్లాస్ బాలికను తుపాకీతో కాల్చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

Man Shoots Girl : ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో ఉన్మాదానికి ఒడిగడుతున్నారు. ప్రేమను తిరస్కరించందని దారుణాలకు తెగబడుతున్నారు. చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీస్తున్నారు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది టెన్త్ క్లాస్ బాలికను తుపాకీతో కాల్చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
అమ్రోహా జిల్లాలోని గజ్రౌలా ప్రాంతానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. జోగిపుర ప్రాంతానికి చెందిన పవన్.. బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడిది వన్ సైడ్ లవ్. తనను ప్రేమించాలని బాలిక వెంటపడేవాడు. ప్రేమ పేరుతో ఆ బాలికకు నరకం చూపించాడు. అతడు ఎంత ఒత్తిడి తెచ్చినా బాలిక బెదరలేదు. అతడి ప్రేమను ఒప్పుకోలేదు.
తన ప్రేమను నిరాకరించడంతో పవన్ ఉన్మాదిలా మారాడు. తన వెంట తుపాకీ తీసుకుని వచ్చాడు. తుపాకీతో బాలికను కాల్చాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉన్మాది కాల్చడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ”4.30 గంటల సమయంలో మాకు సమాచారం వచ్చింది. ఓ వ్యక్తి బాలికను తుపాకీతో కాల్చి ఆ తర్వాత తనను తాను కాల్చుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
బాలికను వెంటనే మీరట్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నాం. యువకుడు మాత్రం స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడిని పవన్ గా గుర్తించాం. అతడి జోగిపుర. బాలిక, యువకుడు ఒకరికి ఒకరు పరిచయం ఉందో లేదో విచారణలో తెలుసుకుంటాం. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాఫ్తు చేస్తున్నాం” అని అమ్రోహ ఎస్పీ ఆదిత్య లాంగే చెప్పారు.