పెళ్లైన 9 నెలలకే, కరోనా భయంతో ఆత్మహత్య

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 03:21 AM IST
పెళ్లైన 9 నెలలకే, కరోనా భయంతో ఆత్మహత్య

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు చనిపోతుంటే, కరోనా ఎక్కడ సోకుతుందోననే భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. కాగా, 9 నెలల క్రితమే అతడికి పెళ్లి అయ్యింది. ఇంతలోనే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

మృతుడి పేరు అషు. వయసు 21 ఏళ్లు. ముజఫర్ నగర్ జిల్లాలోని చాపర్ పరిధిలోని ఖింద్రియా గ్రామ వాసి. అషు ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి వలస వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా అతడిని హోం క్వారంటైన్ లో ఉంచారు. ఏం జరిగిందో ఏమో కానీ.. అనూహ్యంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

అషుకి తొమ్మిది నెలల కిందటే వివాహమైంది. ఇంతలో ఘోరం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచడంతో మనస్తాపానికి గురైన అషు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

Also Read | అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం : అగ్రరాజ్యంలో మొత్తం 50 విపత్తు రాష్ట్రాలను ప్రకటించిన ట్రంప్