Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. మణిపూర్‭ అల్లర్ల నేపథ్యంలో కఠిన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్‌ తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని అన్నారు

Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. మణిపూర్‭ అల్లర్ల నేపథ్యంలో కఠిన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

Manipur violence

Manipur violence: మణిపూర్ రాజధాని ఇంపాల్ సహా ఇతర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధ్వంసకరంగా ఎవరైనా కనిపిస్తే అక్కడే కాల్చేయమంటూ మణిపూర్ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా.. మరో 55 ఆర్మీ బలగాలను తాజాగా మోహరించారు.

Uttar Pradesh: యూపీలో మరో భారీ ఎన్‭కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‭స్టర్ అనిల్ దుజానాను హతమార్చిన టాస్క్‭ఫోర్స్ పోలీసులు

పెద్ద సంఖ్యలో ఉన్న మెయిటీ వర్గం ప్రజలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీనికి ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. దీనికి ఒకరోజు ముందు (బుధవారం) నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని ఆ సంఘం తెలిపింది.

Manipur: నా రాష్ట్రం తగలబడిపోతోంది.. దయచేసి కాపాడండి; మేరీ కోమ్ అభ్యర్థన

వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్‌ తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని పావోటింఠాంగ్ లుఫెంగ్ కోరారు.

Bajrang Dal: బజరంగ్ దళ్ కాంట్రవర్సీని మరో లెవెల్‭కి తీసుకెళ్లిన మనోజ్ ఝా.. హనుమంతుడు కనుక ఇప్పుడు ఉండుంటే వారి చెంపలు పగలగొట్టేవాడట

ఇక ఈ విషయమై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ స్పందిస్తూ.. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే ఈ హింసకు కారణమని అన్నారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో చాలా ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమని బిరేన్ సింగ్ అన్నారు.