Ramagundam : సినిమా చూసి మర్డర్..రామగుండం మీ సేవ ఉద్యోగి హత్య

కోల్డ్‌ కేస్‌ సినిమాలో శతృవును చంపిన కిరాతకులు.. అతని శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో పడేస్తారు. అయితే ఆ మర్డర్‌ .. పోలీసుల హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోతుంది.

Ramagundam : సినిమా చూసి మర్డర్..రామగుండం మీ సేవ ఉద్యోగి హత్య

Ramagundam

Ramagundam Murder : రీల్‌ సంఘటనలు.. రియల్‌గా జరిగిపోతున్నాయి. ఊహించి తెరకెక్కించిన కథలు.. నిజ జీవితంలో భాగమైపోతున్నాయి. సరదా కోసం కొందరు సినిమాలు చూస్తుంటే..  మరికొందరు .. పగ, ప్రతీకారాలు తీర్చుకునేందుకు.. బిగ్‌ స్క్రీన్‌ను ఫాలో అవుతున్నారు. టీవీలు, సినిమాలు చూసి .. మంచి నేర్చుకునే సంగతి ఏమో కానీ..  మర్డర్‌లు, అత్యాచారాలు మాత్రం .. సీన్‌ బై సీన్‌ ఒంటబట్టించుకుంటున్నారు. కట్‌ చేస్తే.. మర్డర్‌కు ఈజీగా స్కెచ్‌ వేసి.. సైలెంట్‌ కిల్లర్స్‌గా మారిపోతున్నారు. ఎవరూ  ఊహించనంత క్రూరంగా.. ఎవరూ నమ్మలేనంత కర్కశంగా .. మనుషులను మట్టుబెడుతున్నారు.

Read More : Mariamma Lock-Up Death: సీబీఐ విచారణ అవసరం లేదు.. మరియమ్మ కేసుపై హైకోర్టు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంచలనం రేపిన మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ను కూడా బిగ్‌స్క్రీన్‌ ఇన్‌ఫ్లూయన్స్ తోనే మర్డర్‌ చేశారు. అదీ మామూలుగా కాదు.. ముక్కలు ముక్కలుగా నరికి.. ఏ భాగం ఎక్కడుందో అర్ధంకాకుండా.. అసలు ఎవరి శరీర భాగాలో తెలియకుండా .. వీధికో అవయవం చప్పున విసిరేసి సినిమా ట్విస్టులు ఇచ్చాడు నిందితుడు. తల, కాళ్లు, చేతులు, మొండెం.. ఒక్కో భాగం ఒక్కోచోట పడేశాడు. ఈ టెర్రర్‌ మర్డర్‌ను చూసి.. పోలీసులకే ముచ్చెమటలు పట్టాయి. ఈ కేసును స్టడీ చేసిన పోలీసులకు ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కో సీన్‌ కనిపించింది.

Read More : TTD OSD : రేపు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు, భౌతికకాయానికి ప్రత్యేక ఇంజక్షన్

అవయవాలను కుటుంబసభ్యులకు చూపించి .. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఇక మాల్యాలపల్లి పరిసర ప్రాంతాల్లో మిగిలిన  భాగాల కోసం వెతకడం మొదలు పెట్టిన పోలీసులకు.. రాజుపై అనుమానం వచ్చింది. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌ చేశారు. నిందితుడు ఒక్కో డెత్‌ సీన్‌ వివరిస్తుంటే .. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. అప్పటికే తల, చేతులను స్వాధీనం చేసుకున్న పోలీసులకు.. బసంత్ నగర్  పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ దగ్గర తల లేని మొండెం.. గోదావరి ఖని సప్తగిరి కాలనీ దగ్గర రెండు కాళ్లు దొరికాయి.

Read More : Parliament : పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే వాయిదాలు.. ప్రతి ప్రశ్నకు బదులిస్తాం – ప్రధాని

కోల్డ్‌ కేస్‌ సినిమాలో శతృవును చంపిన కిరాతకులు.. అతని శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో పడేస్తారు. అయితే ఆ మర్డర్‌ .. పోలీసుల హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోతుంది. నిందితులు సేవ్‌ అవుతారు. సీన్‌ బై సీన్‌ ఫాలో అయ్యాడు. అయితే ఈ కథలో రాజు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులకు చిక్కాడు. ఆస్తి కోసమే ఈ హత్య  చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. ఇప్పటికే భార్య, ఆమె కుటుంబ సభ్యులే శంకర్‌ను హత్య చేయించారంటూ ఆరోపిస్తోంది. మృతుని తల్లి. దీంతో ఆ దిశగా  విచారణ వేగవంతం చేశారు.. పోలీసులు. హత్యలో శంకర్‌ భార్యతో పాటు.. మరి కొందరి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.