Mariamma Lock-Up Death: సీబీఐ విచారణ అవసరం లేదు.. మరియమ్మ కేసుపై హైకోర్టు

అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది.

Mariamma Lock-Up Death: సీబీఐ విచారణ అవసరం లేదు.. మరియమ్మ కేసుపై హైకోర్టు

High Court

Mariamma Lock-Up Death: అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు జరిపించాలని ఆదేశిస్తూ.. కేసును సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరించింది. స్టేట్ బాడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని సూచించింది హైకోర్టు. కేసు తొందరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణలో మరియమ్మ లాకప్ డెత్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ విషయంలో పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్‌, అతని స్నేహితుడు శంకర్ ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారించారు. వారిద్దరి వాంగ్మూలంతో మరియమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ చనిపోయింది. మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి.