Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న అరెస్టు.. క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నడుమ మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.

Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న అరెస్టు.. క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

Theenmar Mallanna

Theenmar Mallanna : తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నడుమ మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం(మార్చి21,2023) రాత్రి 9 గంటలకు దాదాపు 20 మంది పోలీసులు మేడ్జల్ జిల్లా ఫీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

క్యూ న్యూస్ కార్యాలయంలో గంటపాటు పోలీసులు సోదాలు చేశారు. అయితే ఆఫీస్ లోని ఉద్యోగులను, ఇతర సిబ్బందిని బయటకు పంపారు. ఉద్యోగులు, సిబ్బంది బయటకు వెళ్లిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను పరిశీలించారు. కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.

Teenmar mallanna : తీన్మార్ మల్లన్నపై బంజారా‌హిల్స్ పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు

అయితే, ఒక్కసారిగా ఇంతమంది పోలీసులు రావడంతో కార్యాలయ సిబ్బంది ఆందోళన చెందారు. ఆఫీస్ లో పోలీసులు సోదాలు నిర్వహించడంతోపాటు తీర్మార్ మల్లన్నను అరెస్టు చేయడంతో క్యూ న్యూస్ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మల్లన్న అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన్ను అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ చేస్తారోనని భయాందోళనకు గురవుతున్నారు.

గతకొంత కాలంగా తీర్మార్ మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు ప్రసారం చేశారు. ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా చేశారు. పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్, పలువురు మంత్రులపై కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు సోమవారం క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్మీచర్ ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటనపై తీన్మార్ మల్లన్న రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు సిట్ నోటీసులు

మరోవైపు తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్టును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్టు దుర్మార్గం అన్నారు.
ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా? ఖబడ్డార్ కేసీఆర్ అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టు విఠల్ ఆరోగ్యం బాగాలేదని, అతనికి ఏం జరిగినా కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట గలిసిపోతుందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు.