MLAs son-in-law: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య

అప్పుల బాధతోపాటు, కుటుంబంలో ఉన్న సమస్యల కారణంగా గుంటూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు టి.మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

MLAs son-in-law: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య

MLAs son-in-law: గుంటూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు టి.మంజునాథ రెడ్డి (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ప్రగతి అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Nagababu On Mega Carnival: మెగా కార్నివల్‌కు భారీ ఏర్పాట్లు.. అభిమానులకు పండగే అంటోన్న నాగబాబు

మంజునాధరెడ్డి రెడ్డీస్ అండ్ రెడ్డీస్ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నాడు. అయితే, ఆయనకు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తన మామ, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి, మంజునాధరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. అలాగే భార్యతోనూ విబేధాలున్నాయి. మంజునాధరెడ్డి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి అతడి మామ కానీ, కుటుంబ సభ్యులుకానీ ఎవరూ సహకరించడం లేదని సమాచారం. దీంతో ఇటు అప్పులు, అటు కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మంజునాధరెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వాచ్‌మెన్ గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

Chiranjeevi Hospital : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు.. సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం

అనంతరం స్థానిక మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మంజునాధరెడ్డి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఇంకా అదే ఆస్పత్రిలో మంజునాధరెడ్డి మృతదేహం ఉంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరపనున్నారు.