Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు-బెయిల్ పిటీషన్ కొట్టివేత

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను నాంపల్లి  కోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో అరెస్టైన  పబ్ యజమాని అభిషేక్ , మేనేజర్ అనిల్ దాఖలు

Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు-బెయిల్ పిటీషన్ కొట్టివేత

Pudding And Mink Pub Case

Drugs Case :  పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను నాంపల్లి  కోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో అరెస్టైన  పబ్ యజమాని అభిషేక్ , మేనేజర్ అనిల్ దాఖలు చేసుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది.

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో   తెల్లవారు  ఝాముదాకా కార్యకలాపాలు సాగిస్తున్నారు, డ్రగ్స్ వినియోగం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు ఏప్రిల్ 3న పబ్ పై దాడి చేసిన సంగతి  తెలిసిందే. ఈ దాడిలో పబ్ లో టేబుల్స్ పై   ఐదు మిల్లీ గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన  అభిషేక్, అనిల్‌లను  గతవారం నాలుగు రోజులపాటు  కస్టడీకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో నిందితుల నుంచి ఎటువంటి సమాచారం లభించక  పోవటంతో ఈనెల 18న తిరిగి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Also Read : Congress party: అధ్యక్షుడిగా రాహుల్ వద్దు.. కాంగ్రెస్‌లో చర్చనియాంశంగా పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  కాగా… నిందితులకు బెయిల్ లభిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశంఉందని పోలీసుల  తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుల బెయిల్ పిటీషన్ కొట్టి వేశారు.