Murder Case : భర్తను ఎలా చంపాలి పుస్తక రచయిత్రి…భర్తను హత్య చేసిన కేసులో అరెస్ట్

క్కోసారి కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. రచయిత్రి నాన్సీ బ్రోఫీ   అనే రచయిత్రి   2011 లో హౌటూ మర్డర్ యువర్ హస్బెండ్ అనే నవల రాసింది. 

Murder Case : భర్తను ఎలా చంపాలి పుస్తక రచయిత్రి…భర్తను హత్య చేసిన కేసులో అరెస్ట్

Writer Murder Case

Murder Case :  ఒక్కోసారి కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. రచయిత్రి నాన్సీ బ్రోఫీ   అనే రచయిత్రి   2011 లో హౌటూ మర్డర్ యువర్ హస్బెండ్ అనే నవల రాసింది.  ఏడేళ్ల తర్వాత 2018 జూన్ 2న ఆమె భర్త, చెఫ్ గా పని చేసే డేనియల్ బ్రోఫీ హత్యకు గురయ్యాడు. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత నాన్సీ బ్రోఫీ పై హత్యా నేరం మోపబడింది. అందుకు సంబంధించిన కేసు ఇప్పుడు అమెరికాలో విచారణ జరుగుతోంది.

స్ధానికి మీడియా కధనాల ప్రకారం ఆమె రచయితగా ఎప్పుడూ ఆర్ధికంగా ఎప్పుడూ విజయం సాధించలేదు. ఆమె పలు రోమాన్స్ నవలలతో పాటు ‘ది రాంగ్ హస్బెండ్’ మరియు ‘ది రాంగ్ కాప్’ అనే నవలలను రాసింది.  ఆర్ధిక కష్టాలతోనే ఆమె తన భర్తను చంపినట్లు పోలీసులు గుర్తించారు.  భర్త ఇన్సూరెన్స్ డబ్బులకోసమే హత్య చేసి ఉంటుంది పోలీసులు భావిస్తున్నారు.

హత్య జరగటానికి ముందు ఆమె ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి ఒక  బ్యారెల్ గన్ కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. భర్త హత్య తర్వాత ఆ గన్ కనిపించటంలేదు. ఆ బ్యారెల్ గన్ కేవలం పుస్తకం రాయటం  కోసమే కొన్నానని ఆమె వాదిస్తోంది.
Also Read : Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన కేంద్రం
హత్య జరిగిన సమయానికి ఆమె   ట్రక్ డేనియల్ పని చేసే స్కూల్ దగ్గర కనిపించింది. ఆ దృశ్యాలు సీసీటీవీ లో రికార్డయ్యాయి. అయితే తాను అక్కడకు వెళ్లినట్లు గుర్తులేదని  ఆమె చెప్పింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ …ఆమె భర్త పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ లు కడుతూనే ఉందని.. ఆడబ్బు కోసమే ఈ హత్య చేసి ఉండవచ్చని ప్రాసిక్యూషన్ లాయర్ అంటున్నారు. గత నెలలో ప్రారంభమైన విచారణ కొనసాగుతోంది.