Shilpa Chowdary : శిల్పాచౌదరి బ్యాంక్ లాకర్లు తెరిచిన నార్సింగి పోలీసులు

శిల్ప బ్యాంక్‌ లాకర్లపై ఫోకస్‌ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శిల్పను అక్కడికి తీసుకు వెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్‌ లాకర్

Shilpa Chowdary : శిల్పాచౌదరి బ్యాంక్ లాకర్లు తెరిచిన నార్సింగి పోలీసులు

Shilpa Chowdary

Shilpa Chowdary :  ఖతర్నాక్‌ లేడీ శిల్పా చౌదరి కేసులో విచారణను నార్సింగి పోలీసులు వేగవంతం చేసారు. ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు… కోర్టు అనుమతితో ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో శిల్పాచౌదరి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టిందో విచారించారు. ఈ కేసులో తెరపైకి వచ్చిన రాధికారెడ్డి, కొంపల్లి మల్లారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ ప్రతాప్‌రెడ్డి పాత్రలపై ఆరా తీశారు.

శిల్ప బ్యాంక్‌ లాకర్లపై ఫోకస్‌ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శిల్పను అక్కడికి తీసుకు వెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్‌ లాకర్లు ఓపెన్‌ చేసి పరిశీలిస్తున్నారు. లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌, వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశముంది.

మరోవైపు శిల్పా చౌదరిని ఇప్పటికే మూడుసార్లు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన ఖాకీలు.. ఇప్పుడు ఆమె భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌పై ఫోకస్‌ చేశారు. శ్రీనివాస్‌ ప్రసాద్‌ను విచారించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దంపతులిద్దరూ కలిసి ఎలా ఆర్థిక నేరాలు చేశారు.. ఎవరెవరితో లావాదేవీలు నడిపారన్న కోణంలో శ్రీనివాస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read : Burglary Gang Arrested : దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ముఠా అరెస్ట్

గంటసేపు మాట్లాడితే ట్రాప్‌లో పడేస్తుంది. ఒక్కసారి పార్టీకి వెళ్తే మాయ చేసేస్తుంది. అధిక వడ్డీ పేరుతో ఆశలు కల్పిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు డబుల్‌ అవుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఆ తర్వాత కోట్లు దండుకుని చేతులు ఎత్తేస్తుంది. డబ్బు తిరిగివ్వాలని ఎదురు తిరిగితే బౌన్సర్లతో బెదిరిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇదే శిల్పా చౌదరి చేసిన దందా.

శిల్పా చౌదరి.. ఆమె భర్తపై నార్సింగి పోలీసులకు ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర్నుంచి శిల్పా చౌదరి కోట్ల రూపాయలు తీసుకుందని.. డబ్బు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తోందని కంప్లైంట్‌ ఇచ్చారు. దీంతో నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్‌ చేసి లోతుగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి.

శిల్పా చౌదరి తమను మోసం చేసిందంటూ రోహిణిరెడ్డి, దివ్యారెడ్డితో పాటు మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని కూడా కంప్లైంట్‌ చేసింది. శిల్పా చౌదరికి రోహిణిరెడ్డి 3 కోట్ల పది లక్షలు ఇస్తే.. ప్రియదర్శిని 2 కోట్ల 90 లక్షలు ఇచ్చింది. దివ్యారెడ్డి కోటీ 5 లక్షలు సమర్పించుకుంది. ఈ ముగ్గురి నుంచి మొత్తం 7 కోట్ల 5 లక్షలు వసూలు చేసిన శిల్పా చౌదరి.. ఆ తర్వాత హ్యాండిచ్చింది. దీంతో ముగ్గురు బాధితులు నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించారు. వీరే కాకుండా చాలామంది హైప్రొఫైల్‌ మహిళలు కూడా శిల్ప డబ్బిచ్చినట్లు సమాచారముంది. అయితే అదంతా బ్లాక్‌మనీ కావడంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

శిల్పా చౌదరి మోసాలు ఎలా ఉంటాయో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. ప్రియదర్శినిని ట్రాప్‌లో పడేసిన శిల్ప.. 2 కోట్ల 90 లక్షలు తీసుకుంది. వాటికి ష్యూరిటీగా గోల్డ్‌ చెయిన్‌, నకిలీ చెక్కులు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియదర్శిని ఫోన్‌కాల్స్‌ ఎత్తకుండా తప్పించుకుంటూ వచ్చింది శిల్పా చౌదరి. దీంతో అనుమానించిన ప్రియదర్శిని.. తన అనుచరుల్ని డబ్బు వసూలు చేసుకుని రావాలంటూ గండిపేటలోని శిల్పా చౌదరి ఇంటికి పంపించింది. కానీ.. అప్పటికే ఆర్థిక నేరాల్లో ఆరితేరిన శిల్పా చౌదరి.. ప్రియదర్శిని అనుచరులకు చుక్కలు చూపించింది.

డబ్బు వసూలు కోసం నా ఇంటికే వస్తారా అంటూ బెదిరించి వెనక్కి పంపించింది. దీంతో షాకైన ప్రియదర్శిని.. శిల్ప ఇచ్చిన చెక్కుల్ని బ్యాంకులో వేసి డబ్బు రికవరీ చేయాలని ప్రయత్నించింది. కానీ, బ్యాంకుకు వెళ్లాక ఆమెకు మరో షాక్‌ తగిలింది. శిల్ప ఇచ్చినవన్నీ నకిలీ చెక్కులని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత శిల్ప ఇచ్చిన గోల్డ్‌ చెయిన్‌ కూడా నకిలీదేనని తేలడంతో లబోదిబోమంటూ నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించింది ప్రియదర్శిని.

మరోవైపు రోహిణిరెడ్డి కూడా శిల్ప గురించి షాకింగ్‌ విషయాల్ని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరితో ఎవరైనా గంటసేపు మాట్లాడితే ట్రాప్‌లో పడిపోతారని.. తాను కూడా అలాగే మోసపోయానని చెప్పింది. దీంతో హైప్రొఫైల్‌ మహిళల్ని శిల్పా చౌదరి ఎలా ట్రాప్‌ చేసి డబ్బు దండుకుంటుందో పోలీసులకు క్లారిటీ వచ్చింది.