Hawala Cash Seized : నార్సింగి వద్ద కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును హైదారాబద్, నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Hawala Cash Seized : నార్సింగి వద్ద కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hawala Cash Seized

Updated On : November 23, 2021 / 8:08 AM IST

Hawala Cash Seized :  ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును హైదారాబద్, నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సోమవారం సాయంత్రం  మంచిరేవుల వద్ద  తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఇన్నోవా కారును ఆపి చెక్ చేశారు. అందులో కోటి రూపాయల నగదును గుర్తించారు.

నగదు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందుతులు వాటికి సరైన ఆధారాలు చూపించలేక పోయారు. నిందితులు బ్యాంకు ఎకౌంట్లు హ్యాక్ చేసి…  ఖాతాల్లో  ఎక్కువ రోజులుగా  విత్ డ్రా చేయకుండా ఉన్న నగదును గుర్తించి వాటిని తమ ఖాతాల్లోకి ట్రాన్సఫర్ చేసుకుని వాటిని విత్ డ్రా చేసి తీసుకువెళుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : Tamilnadu SI Murder Case : వదిలేయమని బతిమలాడినా కనికరించలేదు… అందుకే చంపేసాం

స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ వారికి అప్పచెప్పారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హవాలా లావాదేవీలకు ఈ నగదు ఉపయోగిస్తుంటారని పోలీసులు తెలిపారు.