తల్లిని కాపాడబోయి : రైలు ఢీకొని కాబోయే జంట మృతి

హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 06:11 AM IST
తల్లిని కాపాడబోయి : రైలు ఢీకొని కాబోయే జంట మృతి

హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం

హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై పడిపోయిన తల్లిని కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. కొత్త జంట మృత్యువాత పడింది. కళ్ల ముందే కొడుకు, కాబోయే కోడల్ని పోగొట్టుకున్న ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన సూర్యకళ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. శేరిలింగంపల్లిలోని రాజీవ్ స్వగృహలో నివాసం ఉంటున్నారు. సూర్యకళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దివ్యాంగుడు కాగా, రెండో కుమారుడు మనోహర్(24) ఆటో నడుపుతూ తల్లికి సాయంగా ఉంటున్నాడు.

మనోహర్‌కు తన మేనకోడలు సోనితో వివాహం చేయాలని ఇటీవల సూర్యకళ నిర్ణయించారు. ఇటీవలే ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ క్రమంలో మంగళవారం(డిసెంబర్ 24,2019) సూర్యకళ సోనిని తీసుకుని గుంటూరు వెళ్లాలనుకుంది. రైలు ఎక్కించేందుకు మనోహర్ కూడా వారితో పాటు చందానగర్ రైల్వే స్టేషన్‌కి వచ్చాడు. అక్కడ రైలు పట్టాలు దాటుతుండగా.. సూర్యకళ అదుపు తప్పి పట్టాల మధ్యలో పడిపోయింది. అప్పటికే పట్టాలు దాటిన మనోహర్, సోనిలు తల్లిని లేపేందుకు వెనక్కి పరిగెత్తారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఎంఎంటీస్ రైలు వారిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.