Digital Rape : 17 ఏళ్ల బాలికను డిజిటల్ రేప్ చేసిన 81 ఏళ్ల వృధ్దుడు అరెస్ట్

కూతురుకు చదువు చెప్పిస్తాడనే   ఆశతో  వృధ్దుడి దగ్గరకు సహాయంగా  పంపిస్తే ఆ వృధ్దుడు  బాలికపై   లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Digital Rape : 17 ఏళ్ల బాలికను డిజిటల్ రేప్ చేసిన 81 ఏళ్ల వృధ్దుడు అరెస్ట్

Digital Rape

Digital Rape : కూతురుకు చదువు చెప్పిస్తాడనే   ఆశతో  వృధ్దుడి దగ్గరకు సహాయంగా  పంపిస్తే ఆ వృధ్దుడు  బాలికపై   లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లపాటు ఈ అరాచకం  సాగింది. చివరికి  బాధితురాలు ధైర్యం  చేసి చెప్పటంతో ఈ వేధింపుల పర్వం వెలుగు చూసింది.

ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా సెక్టార్ 39, గౌతమ్ బుధ్ధ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే మౌరైన్ రైడర్ (81) వృత్తి రీత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ కూడా.   అతని దగ్గర 20 ఏళ్లుగా పని చేసే  ఒక వ్యక్తి తన పదేళ్ల కుమార్తెను ఆ వృధ్దుడికి  సాయంగా పంపించ సాగాడు.  అందుకు బదులుగా ఆ బాలికకు చదువు చెప్పిస్తానని మౌరైన్ రైడర్ హామీ ఇచ్చాడు. ఇది ఏడేళ్ల క్రితం జరిగింది.

అయితే ఆ నాటి నుంచి నేటి వరకు మౌరైన్ రైడర్ బాలికపై డిజిటల్ రేప్ చేస్తూనే ఉన్నాడు.  తండ్రికి చెబితే ఆకుటుంబాన్ని   సర్వ నాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు.  ఈ క్రమంలో ఆమె ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చింది. ఇప్పుడు టీనేజ్ కు  వచ్చిన ఆ బాలిక ధైర్యం తెచ్చుకుంది.

గత నెలరోజులుగా మౌరైన్ రైడర్ బాగోతాలను అతడికి  తెలియకుండా రికార్డింగ్ చేయటం మొదలెట్టింది.  అందులో ఎక్కువగా ఆడియో ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఒక మహిళకు ద్వారా పోలీసులకు పంపించి ఫిర్యాదు చేసింది. నోయిడాలోని గౌతమ్ బుధ్ద నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం డిజిటల్ రేప్ కింద మౌరైన్ రైడర్ ను అరెస్ట్ చేశారు.

డిజిటల్ రేప్ అంటే…. చాలామంది ఆన్‌లైన్‌కు సంబంధించిన నేరం అనుకుంటారు. కానీ డిజిటల్ రేప్ అంటే మర్మాంగం కాకుండా ఏదైనా వస్తువు, ఆయుధాలను, చేతివేళ్లను ఉపయోగించి అసహజ రీతిలో మహిళ, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడటంగా నిర్వచించారు.

గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ 2012 లో నిర్భయ ఘటన తర్వాత డిజిటల్ రేప్ ను అమలులోకి తీసుకువచ్చారు. డిజిటల్ రేప్ కింద ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్ళు, గరిష్టంగా పదేళ్లు ఒక్కోసారి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

ఈ తరహా ఘటనలు సాధారణంగా దగ్గర వాళ్ల వల్లే జరుగుతుంటాయి. కాబట్టే చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376,323,506 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read : Gyanvapi Mosque: తవ్వకాలు మక్కాలో జరిపితే అక్కడా శివుని విగ్రహాలు కనిపిస్తాయి – డిప్యూటీ సీఎం