Viral video: బిహార్‌లో దారుణ ఘటన.. 9వ తరగతి బాలిక మెడపై యువకుడి కాల్పులు.. సీసీ కెమెరాలో రికార్డు

బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్నాలో ఓ బాలిక (15) మెడపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపారా, ఇంద్రపురి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుంది తొమ్మిదో తరగతి బాలిక. ఆమె కోసం అక్కడ కొద్ది సేపటి నుంచి ఎదురుచూస్తున్నాడు ఓ యువకుడు. అతడితో మాట్లాడకుండా ఆమె ముందుకు వెళ్ళసాగింది. తనతో తీసుకువచ్చిన తుపాకీతో బయటకు తీసిన యువకుడు ఆ బాలిక వెనక నుంచి మెడపై కాల్చాడు.

Viral video: బిహార్‌లో దారుణ ఘటన.. 9వ తరగతి బాలిక మెడపై యువకుడి కాల్పులు.. సీసీ కెమెరాలో రికార్డు
ad

Viral video: బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్నాలో ఓ బాలిక (15) మెడపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపారా, ఇంద్రపురి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుంది తొమ్మిదో తరగతి బాలిక. ఆమె కోసం అక్కడ కొద్ది సేపటి నుంచి ఎదురుచూస్తున్నాడు ఓ యువకుడు.

అతడితో మాట్లాడకుండా ఆమె ముందుకు వెళ్ళసాగింది. తనతో తీసుకువచ్చిన తుపాకీతో బయటకు తీసిన యువకుడు ఆ బాలిక వెనక నుంచి మెడపై కాల్చాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలిక గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యువకుడి వివరాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ బాలిక అతడి ప్రేమను తిరస్కరిస్తుండడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధిత బాలిక స్థానికంగా కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూతురని పోలీసులు చెప్పారు.

9వ తరగతి బాలిక మెడపై యువకుడి కాల్పులు