Hyderabad : హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుని అత్తింట్లో మకాం వేసిన పాక్ యువకుడు, అరెస్ట్ చేసిన పోలీసులు

షార్జాలో భారత్ యువతిని వివాహం చేసుకుని హైదరాబాద్ లో మకాం వేసిన పాకిస్థాన్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ యువతిని వివాహం చేసుకున్న పాక్ యువకుడి వెనక కుట్ర ఉందా..?

Hyderabad :  హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుని అత్తింట్లో మకాం వేసిన పాక్ యువకుడు, అరెస్ట్ చేసిన పోలీసులు

Pakistan man marriage india woman 

Updated On : September 1, 2023 / 11:45 AM IST

Hyderabad police arrested Pakistani man : హైదరాబాద్ పోలీసులు పాతబస్తీలో మకాం వేసిన ఓ పాకిస్థాన్ యువకుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని పాక్ నుంచి వచ్చేసి అత్తగారింట్లో ఇల్లరికపు అల్లుడిగా మకాం వేసిన ఫయాజ్ అనే పాక్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం క్రితం పాతబస్తీకి చెందిన నేహా ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకుని హైదరాబాద్ కు వచ్చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు అత్తామామలు షేక్ జుబేర్, అఫ్జల్ బేగంపై కూడా కేసు నమోదు చేశారు. ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన వెంటనే షేక్ జుబేర్, అఫ్జల్ బేగం పరారయ్యారు.

Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి

షార్జాలో ప్రేమ,పెళ్లి..హైదరాబాద్ లో మకాం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫయాజ్ అహ్మద్ అనే 24 ఏళ్ల పాక్‌ యువకుడు ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు చెందినవాడు. 2018లో ఉపాధి కోసం షార్జా వెళ్లాడు. అక్కడే ఓ బట్టల షాపులో పనికి కుదిరాడు. అలాగే హైదరాబాద్‌ బహదూర్‌పురాకు చెందిన నేహా ఫాతిమా అనే యువతి కూడా ఉపాధి కోసం షార్జా వెళ్లింది. అక్కడ ఫయాజ్ తో పరిచయం అయ్యింది. అతని  సహాయంతో ఉద్యోగం సంపాదించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు 2019లో షార్జాలోనే పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఆ తరవాత ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లాడు. నేహ ఫాతిమా హైదరాబాద్ లోని వారి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది.

ఈ క్రమంలో ఫాతిమా తల్లిదండ్రులు పాకిస్థాన్‌లోనే ఉంటున్న అల్లుడు ఫయాజ్ తో కొంతకాలం క్రితం మాట్లాడారు. అమ్మాయి ఇక్కడే ఉంది కదా మీరిద్దరు ఇలా విడి విడిగా ఉండటం ఎందుకు..? భారత్ వచ్చేయమని చెప్పారు.  దీంతో ఫయాజ్ భార్య వద్దకు రావటానికి నేపాల్ వెళ్లాడు.అక్కడినుంచి అత్తమామల సహాయంతో హైదరాబాద్ కు వచ్చారు.దీంట్లో భాగంగా 2022 లో పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లాడు. అక్కడే ఫయాజ్‌ను ఫాతిమా తల్లిదండ్రులు కలుసుకుని కొంతమంది సహాయంతో హైదరాబాద్ తీసుకొచ్చారు. అలా హైదరాబాద్ లో తొమ్మిది నెలల నుంచి ఉంటున్నాడు ఫయాజ్.

నేపాల్ నుంచి భారత్ లోకి ..
అతని తమ స్థానికుడిగా చెలామణి చేయించానికి ఫయాజ్ అత్తమామలు షేక్ జుబేర్, అఫ్జల్ బేగం ఓ ఆధార్ కార్డు క్రియేట్ చేసేందుకు వెళ్లారు. నగంలోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లి ఫయాజ్‌ను తమ కుమారుడుగా చెప్పి..ఆధార్ కార్డు పొందేందుకు యత్నించారు. దీని కోసం ఫేక్ పేపర్స్ ఇచ్చారు. కానీ ఫయాజ్ పై అనుమానాలు వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో రంగంలోకి దిగి ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థానీ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోగా దానికి గడువు ముగిసినట్టు గుర్తించారు. ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్, అఫ్జల్ బేగం పరారయ్యారు. ఇలా అక్రమంగా భారత్ లో ఉంటున్న ఫయాజ్ వెనుక ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు,నిఘా వర్గాలు.