RJD MLA: బిహార్ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష

అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

RJD MLA: బిహార్ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష

Rjd Mla (1)

RJD MLA: అక్రమంగా ఏకే 47 తుపాకితోపాటు, ఇతర ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా ఎమ్మెల్యేకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. బిహార్‌లోని మొకామా నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) తరఫున అనంత్ సింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనను స్థానికంగా చోటే సర్కార్ అని పిలుస్తారు.

Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే

అయితే, అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ దాడి తర్వాత అనంత్ సింగ్ కొంతకాలం కనిపించకుండా పోయారు. తర్వాత ఒక వీడియో విడుదల చేశాడు. రాజకీయ శక్తులు తనను అణచివేసేందుకు కుట్ర పన్నాయని, అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన వీడియోలో వివరించారు.

Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

తర్వాత కోర్టులో లొంగిపోయారు. అప్పట్నుంచి కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూ వచ్చింది. 13 మంది సాక్షులను విచారించిన కోర్టు అనంత్ సింగ్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు నమ్మింది. దీంతో పాట్నా స్పెషల్ కోర్టు ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంత్ సింగ్‌తోపాటు అతడి అనుచరుడికి కూడా కోర్టు పదేళ్ల శిక్ష విధించింది.