Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే

తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడారు.

Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు అల్టిమేటమ్ జారీ చేశారు శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే. శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే శివసేనలో చీలిక తప్పదని హెచ్చరించారు. ఎన్సీపీ-కాంగ్రెస్‌లతో శివసేన కలవకూడదని ఆయన సూచించారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే, సూరత్‌లో తిరుగుబాటు క్యాంప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?

అక్కడి ఒక హోటల్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడారు. 35 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని, బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారు. లేకపోతే పార్టీలో చీలిక తప్పదని హెచ్చరించారు. మహా వికాస్ అఘాడి నుంచి బయటకు రావాలని షిండే డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఆశ పడటం లేదని, తనపై పార్టీ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లు సమాచారం.

Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

తాజా పరిణామాల నేపథ్యంలో షిండేను శివసేన తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు శివసేన కార్యకర్తలు తనకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడాన్ని కూడా షిండే తప్పుబట్టినట్లు సమాచారం. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన కలవడం తమ పార్టీలోని చాలా మందికి ఇష్టం లేదని షిండే వ్యాఖ్యానించారు. కాగా, షిండే డిమాండ్‌‌పై ఉద్ధవ్ థాక్రే స్పందించారు. శివసేన కార్యకర్తల్ని, నేతల్ని బీజేపీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అన్నారు.