Sidhu Moosewala’s postmortem : సిద్ధూ బాడీలో 25 బుల్లెట్లు.. ఎంత కసిగా చంపారంటే.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని తూట్లు పొడిచారు. సిద్ధూ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.(Sidhu Moosewala's postmortem)

Sidhu Moosewala’s postmortem : సిద్ధూ బాడీలో 25 బుల్లెట్లు.. ఎంత కసిగా చంపారంటే.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

Sidhu Moosewala's Postmortem

Sidhu Moosewala’s postmortem : ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా, మూసేవాలా పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మూసేవాలాను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అతడి శరీరంలో 25 బుల్లెట్లు, గన్ పౌడర్ గుర్తించారు. మూసేవాలా పుర్రెలోనూ ఓ బుల్లెట్ ను గుర్తించారు. దీన్ని బట్టి మూసేవాలను దుండగులు ఎంత కసిగా చంపారో అర్థమవుతుంది.

గత ఆదివారం(మే 29) సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యాడు. సాయంత్రం 5గంటల 25 నిమిషాలకు ఈ ఘటన జరగ్గా.. 5గంటల 50 నిమిషాలకు పోలీసులకు సమాచారం అందింది. దుండగుల కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా స్పాట్ లోనే చనిపోయాడు.

తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి.. సిద్ధుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. 30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని వారు తూట్లు పొడిచారని.. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసుల విచారణలో వెల్లడైంది.(Sidhu Moosewala’s postmortem)

Moosewala murder case: సిద్ధూ మూసే వాలాను హత్యకు ఏఎన్-94 రష్యన్ అసాల్ట్ రైఫిల్ ఉపయోగించారు

శక్తిమంతమైన అస్సాల్ట్ తుపాకులతో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్లు మూసేవాలా దేహం నుంచి అవతలి వైపుకు దూసుకెళ్లాయి. ఈ మేరకు పోస్టుమార్టం చేసిన వైద్యులు 25 బుల్లెట్ల తాలూకు ‘ఎంట్రీ అండ్ ఎగ్జిట్’ ఆనవాళ్లను గుర్తించారు. లోపలి అవయవాలన్నీ బుల్లెట్ గాయాలతో దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

గ్యాంగ్‌స్టర్‌ గొడవలు, హత్యల కారణంగానే సిద్ధూ మూసేవాలా మర్డర్ జరిగినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు. గతేడాది అకాలీదల్‌ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో మూసేవాలా మేనేజర్ పేరును లాగడంతో సిద్ధుపై కక్షగట్టిన దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

మూసేవాలా అంత్యక్రియలు స్వగ్రామం మూసాలో నిర్వహించారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. మూసేవాలా జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా మూసేవాలా అంత్యక్రియలకు హాజరయ్యారు. సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు తమ బిడ్డ శవపేటికను కన్నీటి నడుమ ముద్దాడడం అందరినీ కలచివేసింది.

సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని సిద్ధూకు తుది వీడ్కోలు పలికారు. సిద్ధూకు ఎంతో ఇష్టమైన తన ట్రాక్టర్‌లోనే అంతిమ యాత్ర నిర్వహించారు.(Sidhu Moosewala’s postmortem)

Punjab govt: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు రానున్న 400మంది పోలీసులు..

సిద్ధూకు తన ట్రాక్టర్‌ అంటే ఎంతో ఇష్టం. అతను చేసిన అనేక మ్యూజిక్‌ వీడియోల్లోనూ ఇది కన్పిస్తుంది. అందుకే దానిపై అంతిమయాత్ర నిర్వహించారు. సొంత పొలంలో సిద్ధూ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

సిద్ధూను చివరిసారి చూసేందుకు పంజాబ్‌తో పాటు, రాజస్తాన్‌, చండీగఢ్‌ నుంచి వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి పోటెత్తారు. దీంతో ఆయన నివాసం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. అనంతరం భారీ భద్రత నడుమ సిద్ధూ అంతిమయాత్ర నిర్వహించారు.

వీఐపీ సంస్కృతికి తెరదించే ఉద్దేశంతో సిద్ధూతో పాటు పలువురు ప్రముఖుల భద్రతను కుదిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఈ ఘోరం జరగడం గమనార్హం. దీంతో సిద్ధూ హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది.

భద్రతను కుదించడం ద్వారా సిద్ధూ హత్యకు పంజాబ్‌లోని ఆప్‌ సర్కార్ కారణమైందని శిరోమణి అకాలీదళ్‌ ఆరోపించింది. రాష్ట్ర సర్కార్ ను రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌కు ఆ పార్టీ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. సిద్ధూ హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరింది.