Moosewala murder case: సిద్ధూ మూసే వాలాను హత్యకు ఏఎన్-94 రష్యన్ అసాల్ట్ రైఫిల్ ఉపయోగించారు

దుండగులు 1994 నాటి అవ్టోమాట్ నికోనోవా మోడల్ అయిన AN-94 రష్యన్ అస్సాల్ట్ రైఫిల్‌ ను ఈ హత్య కోసం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.

Moosewala murder case: సిద్ధూ మూసే వాలాను హత్యకు ఏఎన్-94 రష్యన్ అసాల్ట్ రైఫిల్ ఉపయోగించారు

Sidhu

Moosewala murder case: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కారులో వెళుతున్న మూసేవాలాను దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. ఆదివారం పంజాబ్ లోని జవహర్ కే గ్రామం వద్ద ఇద్దరు మిత్రులతో కలిసి కారులో వెళ్తున్న సిద్ధూ మూసేవాలాను అడ్డగించిన దుండగులు..అతనిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని..మూసేవాలను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆటను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఈ హత్య ఘటనపై సిద్ధూ తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పంజాబ్ డీజీపీ..వి కె భావరా సోమవారం మీడియాతో మాట్లాడుతూ..సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితుల కోసం వేట కొనసాగుతున్నట్లు తెలిపారు. దుండగులు 1994 నాటి అవ్టోమాట్ నికోనోవా మోడల్ అయిన AN-94 రష్యన్ అస్సాల్ట్ రైఫిల్‌ ను ఈ హత్య కోసం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.

other stories: Sidhu Died: కాంగ్రెస్ లీడర్ సిద్ధూ తుపాకీ కాల్పుల్లో మృతి

హత్యకు సంబందించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదు కాగా..ఫుటేజీని పరిశీలించిన పోలీసులు..దుండగుల కారు నెంబర్ ప్లేట్ ను తనిఖీ చేశారు. అయితే దుండగులు నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగించినట్లు తెలిసింది. అయితే మృతుడి తండ్రి తెలిపిన వివరాలు మేరకు.. సిద్ధూ మూసేవాలాకు గోల్డీ బ్రార్ మరియు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వర్గాలతో ప్రాణహాని పొంచి ఉందని..ప్రధానంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపు కాల్స్ వచ్చేవని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. కాగా, పంజాబీతో పాటు బాలీవుడ్ వర్గాల్లోనూ పాప్యులర్ అయిన సిద్ధూ మూసేవాలాకు, గూండాల నుంచి ప్రాణహాని ఉందన్న సమాచారం మేరకు గతంలో పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డ్ తో కూడిన భద్రత కల్పించింది.

other stories: Punjab govt: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు రానున్న 400మంది పోలీసులు..

ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సర్కార్, రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని వీఐపీలకు భద్రత ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకున్న మరుసటి రోజే..దుండగులు సిద్ధూ మూసేవాలాను హతమార్చారు. దీంతో సీఎం భగవంత్ మాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కేసు విచారణలో భాగంగా హత్య జరిగిన ప్రాంతంలోని సెల్ టవర్ సిగ్నల్స్, ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థలను పోలీసులు పరిశీలించనున్నారు. హత్యకు ముందు గంట పాటు జవహర్ కే గ్రామం పరిధిలో సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని ట్రేస్ చేయనున్నారు పోలీసులు. ఆ సమయంలో సుమారు లక్ష సెల్ ఫోన్స్ ఆ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా నిందితులను ట్రేస్ చేయనున్నట్లు డీజీపీ వివరించారు.