Sidhu Died: కాంగ్రెస్ లీడర్ సిద్ధూ తుపాకీ కాల్పుల్లో మృతి

కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.

Sidhu Died: కాంగ్రెస్ లీడర్ సిద్ధూ తుపాకీ కాల్పుల్లో మృతి

Sidhu

Updated On : May 29, 2022 / 6:59 PM IST

Sidhu Died: కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు. వైద్యులు సిద్ధూ చనిపోయినట్లు నిర్ధారించగా, మిగతా ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

424 మంది వ్యక్తులకు పోలీసులు సెక్యూరిటీ విత్ డ్రా చేసుకున్న మరుసటి రోజే ఈ ఘటన నమోదు కావడం గమనార్హం.

చివరిసారిగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తో సిద్దూ మూసె వాలా పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో 63వేల ఓట్లతో ఓడిపోయారు. రీసెంట్ గా పంజాబ్ సీఎం భగవత్ పదవిలో నుంచి తప్పించింది ఈయణ్నే.

గత నెలలో ఆప్ ను, ఆ పార్టీ సపోర్ట్లను టార్గెట్ చేస్తూ.. ఒక పాటు పాడారు సిద్ధూ.

Read Also: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు రానున్న 400మంది పోలీసులు..