Singapore : పని మనిషిపై దాడి కేసు.. సింగపూర్ లో భారతీయురాలికి జైలు శిక్ష

2021 ఏప్రిల్ 10న లివింగ్ రూమ్లోని కొన్ని బొమ్మలను ఆమె శుభ్రం చేస్తుండగా శర్మ భార్య మోనికా శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై మూడుసార్లు ముఖంపై పిడిగుద్దులు గుద్దారు.

Singapore : పని మనిషిపై దాడి కేసు.. సింగపూర్ లో భారతీయురాలికి జైలు శిక్ష

Singapore

Singapore : పని మనిషిపై దాడి కేసులో సింగపూర్ లో ఓ భారతీయురాలికి జైలు శిక్ష పడింది. పని సక్రమంగా చేయలేదనే కోపంతో పని మనిషిపై పిడిగుద్దలతో దాడి చేసి గాయపర్చిన భారత మహిళ(37)కు సింగపూర్ కోర్టు 16 వారాలు జైలు శిక్ష విధించింది. సింగపూర్ లోని తన ఇంటిలో పని చేయడానికి ఒక ఏజెంట్ ద్వారా భారతీయ యువతి(25)ని శర్మ అనే భారతీయుడు రప్పించారు.

2021 ఏప్రిల్ 10న లివింగ్ రూమ్లోని కొన్ని బొమ్మలను ఆమె శుభ్రం చేస్తుండగా శర్మ భార్య మోనికా శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై మూడుసార్లు ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. మోనికా శర్మ వాంతి చేసుకున్న పదార్థాన్ని పని మనిషి మొఖంపై విసిరి కొట్టారు. బాధితురాలు తనపై మోనికా శర్మ దాడి చేసిన ఫోటోలను ఏజెంట్ కు, సింగపూర్ లోని కొంతమందికి పంపారు.

Seattle Bans caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన అమెరికాలోని తొలి నగరం

దీంతో పోలీసులు మోనికా శర్మపై కేసు నమోదు చేశారు. కేసు విచారించిన కోర్టు మోనికా శర్మకు 16 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. రూ.10వేల డాలర్ల పూచీకత్తుతో ఆమెకు తాత్కిలిక బెయిల్ మంజూరు చేస్తూ మే23వ తేదీ నుంచి శిక్ష అమలవుతుందని పేర్కొంది.