Pencil Girl Dies : తల్లిదండ్రులూ, బీకేర్ ఫుల్.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి

పెన్సిల్ పొట్టు చిన్నారి ప్రాణం తీసింది. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలిక మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హమీర్‌పూర్‌లో ఈ విషాదం జరిగింది.

Pencil Girl Dies : తల్లిదండ్రులూ, బీకేర్ ఫుల్.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి

Pencil Girl Dies : పిల్లలు అమాయకులు. అభంశుభం తెలియని చిన్నారులు. ఏది ప్రమాదమో, ప్రాణాంతకమో తెలియని వయసు. వారిని తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అలాంటి దారుణం ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెన్సిల్ పొట్టు చిన్నారి ప్రాణం తీసింది. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలిక మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హమీర్‌పూర్‌లో ఈ విషాదం జరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హమీర్‌పూర్‌ కొత్వాలి ప్రాంతంలోని పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకిషోర్‌కు కుమారుడు అభిషేక్ (12), కుమార్తెలు అన్షిక (8), ఆర్తిక (6) ఉన్నారు. బుధవారం సాయంత్రం టెర్రస్‌పై చదువుకుంటున్నారు. హోమ్‌వర్క్ చేయడానికి కూతురు ఆర్తిక పెన్సిల్‌ షార్ప్‌నర్‌ను నోట్లో పెట్టుకొని పెన్సిల్‌ను చెక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెన్సిల్‌ను చెక్కగా వచ్చిన పొట్టు గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది.

Also Read..Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మృతి

ఆ పొట్టు గొంతుకు అడ్డుగా పడడంతో బాధతో విలవిలలాడింది. వెంటనే బంధువులు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. బాలిక అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. పాప ఇక లేదు అని తెలుసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. భోరున విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆర్తిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

Also Read..Boy Died Warangal : వరంగల్‌లో విషాదం.. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని బాలుడు మృతి

ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. చిన్నపిల్లలను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇలా నిరంతరం నిఘా ఉండాలి. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ఇక కొందరు పిల్లలు పడుకునే ఆహారం లేదా నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు. శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోయి మరణానికి దారితీయవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. పెన్సిల్, పెన్, ఎరేజర్, షార్ప్ నర్.. ఇలా ప్రతీ విషయంలోనూ అంతే. వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. లేదంటే ప్రమాదాలు తప్పవంటున్నారు నిపుణులు.

కాగా, ఇటీవలే చాక్లెట్, కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఇద్దరు చిన్నారులు చనిపోయారు. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని వరంగల్ లో 8ఏళ్ల బాలుడు, నెక్కొండలో కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలని ఈ సంఘటనలు చెబుతున్నాయి.