Snake Venom : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే……

పాము విషం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఒడిషాలోని డియోగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Snake Venom : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే……

Snake Venom

Updated On : November 21, 2021 / 9:16 AM IST

Snake Venom :  కిలో బంగారం ఎంత…. అంటే ఒక రేటు చెపుతారు. కిలో వెండి ఎంత దానికీ ఒక రేటు ఉంటుంది….. చెపుతారు. కిలో పాము విషం ఎంత  అంటే …. ?  అవును ఇప్పుడు పాము విషం కూడా మార్కెట్ లో అమ్మకానికి వచ్చింది.

పాము విషం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఒడిషాలోని డియోగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషాలోని సంబల్ పూర్, జిల్లాలోని సిదుర్పంక్ లో పాము విషం అమ్ముతున్నారని డియోగఢ్ పోలీసులు తెలుసుకున్నారు.  పోలీసులు కొనుగోలు దారుల్లా వెళ్లి విషం కిలో కావాలని అడిగారు.
Also Read : Husband Eloped : కుటుంబ కలహాలు-భర్త అదృశ్యం
దీంతో వారు గాజు పాత్రలో ఉంచిన  విషాన్ని తీసుకు వచ్చి ఇచ్చి రూ.1.5 కోట్లు ఇవ్వాలని రేటు చెప్పారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అది పాము విషమా ?  కాదా ?  అనే విషయాన్ని తెలుసుకోడానికి దాన్నిల్యాబ్ కు పరీక్షకు పంపించారు.