Tamil Nadu : అనాథాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళల్ని బంధించి కోతులతో కరిపించి అత్యాచారాలు

తమిళనాడులో అనాధా శ్రమంలోని మానసిక వికలాంగ మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మానసికంగా బాధపడే మహిళలతో పాటు..భర్తను కోల్పోయిన మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు. లొంగని మహిళల్ని ఇనుమ గొలుసులతో బంధించి వారిపై కోతులతో దాడులు చేయించి మరీ అత్యాచారాలు చేస్తున్న అత్యంత దారుణ ఘటనలో వెలుగులోకి వచ్చాయి.

Tamil Nadu : అనాథాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళల్ని బంధించి కోతులతో కరిపించి అత్యాచారాలు

Inmates chained..raped, thrown to monkeys in Villupuram shelter home

Tamil Nadu : తమిళనాడులో అత్యంత అమానుషమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనాధా శ్రమంలోని మానసిక వికలాంగ మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మానసికంగా బాధపడే మహిళలతో పాటు..భర్తను కోల్పోయిన మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు. లొంగని మహిళల్ని ఇనుమ గొలుసులతో బంధించి వారిపై కోతులతో దాడులు చేయించి మరీ అత్యాచారాలు చేస్తున్న అత్యంత దారుణ ఘటనలో వెలుగులోకి వచ్చాయి. లొంగని మహిళలను సంకె ళ్లతో కట్టేసి వారిపైకి కోతులను ఉసిగొల్పి కరిపించి మరీ అత్యాచారాలకు పాల్పడిన అమానవీయ ఘటనలో తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని అన్బు జ్యోతి అనాథాశ్రమంలో జరుగుతున్నాయి. ఆశ్రమంలో ఉండే తన బంధువు కొంతకాలంగా కనిపించకపోవటంతో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

గుండల పులియూర్ గ్రామంలో ఉన్న అన్బు జ్యోతి అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళలకు మత్తుమందిచ్చి ఇనుపరాడ్డులతో దారుణంగా కొట్టి అత్యాచారం చేశారు ఆశ్రమ నిర్వాహకులు. లొంగనివారిని ఇనుప గొలుసులతో కట్టేసి వారిని కోతులతో కరిపించి మరీ అత్యాచారాలకు పాల్పడ్డారు ఆశ్రమ నిర్వాహకులు. అన్బు జ్యోతి అనాథశ్రమంలో 109మంది పురుషులు, 33మంది మహిళలు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 16 మంది కనిపించకుండాపోయారు. ఓ వ్యక్తిచేసిన ఫిర్యాదుతో అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమంలో 16మంది మహిళలకు మిస్ అయినట్లుగా గుర్తించారు.

అమెరికాలో ఉంటున్న సలీంఖాన్ అనే వ్యక్తి అన్బు జ్యోతి ఆశ్రమంలో ఉంటున్న తన బంధువు కనిపించటంలేదని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన మామ అన్బు జ్యోతి ఆశ్రమంలో డిసెంబర్ 21 నుంచి ఉంటున్నారని అతను ఇటీవల కనిపించటంలేదంటూ వెల్లడించారు.

తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని..తాను ప్రతిఘటించటంతో తనను ఇనుప సంకెళ్లతో కట్టేసి, కోతుల బోనులో వేసి కరిపించి అత్యాచారం చేశారని ఒడిశాకు చెందిన ఓ బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసు, రెవెన్యూ అధికారులు… ఆశ్రమంలోని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయగా 17 సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ అనాథాశ్రమం నడుపుతున్నారని తేలింది.షెల్టర్ హోమ్ యజమాని తన అనుచరులతో హోమ్ లో ఉండే మహిళలపై అత్యాచారాల్ని అత్యంత క్రూరంగా హింసించి పాల్పడుతున్నాడని తేలింది.

ఈ దారుణంపై విల్లుపురం జిల్లా కలెక్టర్ సి.పళని మాట్లాడుతూ..ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న అన్బుజ్యోతి అనాథాశ్రమాన్ని మూసివేస్తామని తెలిపారు. మహిళలపై ఇటువంటి దారుణాలకు పాల్పడిన ఎనిమిదిమందిపై వేధింపుల నిషేధ చట్టంకింద భారతీయ శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారానికి శిక్ష), మహిళలపై వేధింపుల నిషేధ చట్టం, 1998లోని సెక్షన్ 4 సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశామని విల్లుపురం ఎస్పీ ఎన్.శ్రీనాథ తెలిపారు. ఈ ఎనిమిదిమందిలో నలుగురిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ అనాథాశ్రమంలోని మహిళలను ఇతర ప్రాంతాలకు తరలిపించామని తెలిపారు.

అనాథాశ్రమంలో ప్రాణాలతో బయపడిన కొంతమంది చెప్పిన వివరాలు వింటేనే ఒళ్లు గగొర్పిడిచేలా ఉన్నాయి.యుక్త వయస్సులో ఉండగానే తాను ఒడిశా నుంచి తమిళనాడుకు వచ్చానని విల్లుపురంలో భిక్షాటన చేస్తు జీవిస్తున్నానని..అటువంటి తనను ఓ టీమ్ వచ్చి నిన్ను బాగా చూసుకుంటాం అంటూ అన్బు జ్యోతి ఆశ్రమానికి తీసుకెళ్లిందని అలా ఆశ్రమంలో చేరిన తనపై ఎన్నోసార్లు అత్యాచారాలు జరిగాయని కన్నీటితో వెల్లడించింది.తాను ప్రతిఘటిస్తే కోతుల బోనులో వేసి కోతులతో కరిపించి అత్యాచారం చేసేవారని వాపోయింది. ఆశ్రమంలోని చాలామంది మహిళలను గొలుసులతో కట్టేసి ఉంచుతారని నిద్రమాత్రలు ఇచ్చి వారిపై అత్యాచారాలు చేస్తారని వెల్లడించింది.

ప్రతిఘటిస్తే వారిని ఇనుప రాడ్లతో అత్యంత అమానుషంగా కొడతారని కోతులతో దాడి చేయించి అత్యాచారాలు చేస్తారని తెలిపింది. ఇటువంటి దారుణంలో గురైన నాతోటి బాధితులు వారి శరీరాలపై దెబ్బల గాయాలుంటాయని రక్తం గడ్డకట్టి ఎంతో బాధలు పడేవారిని కూడా విడిచిపెట్టకుండా నిరంతరం అత్యాచారాలకు పాల్పడుతున్నారని వాపోయింది.