Teacher Assault Girl Student : పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో బయటపడిన దారుణం

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన గురువే దారితప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు లాంటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు.

Teacher Assault Girl Student : పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో బయటపడిన దారుణం

Teacher Assault Girl Student : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన గురువే దారితప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు లాంటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని విద్యార్థినిని బెదిరించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చటంతో.. ఆ ఉపాధ్యాయుడి కీచక పర్వం బయటపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఈ వికృత ఘటన వెలుగు చూసింది. దమ్మపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థినిపై లెక్కల టీచర్ పిచ్చయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించాడు. బెదిరిపోయిన బాలికను పలుమార్లు రేప్ చేసి తమ పశువాంఛ తీర్చుకున్నాడు. టీచర్ బెదిరించడంతో భయపడ్డ విద్యార్థిని విషయం ఎవరికీ చెప్పలేదు. అతడి అఘాయిత్యాలను మౌనంగా భరించింది.

ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత విద్యార్థిని అనారోగ్యానికి గురైంది. ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు షాకింగ్ విషయం చెప్పారు. బాలిక గర్భవతి అని నిర్ధారించారు.

ఈ విషయం విని కంగుతిన్న తల్లిందండ్రులు.. కూతురుని నిలదీశారు. చెప్పేందుకు ముందు భయపడిన బాలిక.. అనంతరం ఈ కీచక ఉపాధ్యాయుడి బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో టీచర్ పిచ్చయ్యపై ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే దారి తప్పడం జీర్ణించుకోలేకపోతున్నారు. పరీక్షలను అడ్డం పెట్టుకుని బాలికను బెదిరించి తన కామవాంఛను తీర్చుకున్న ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.