Terrorist Attack Pakistan : పాకిస్తాన్ లో కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి.. తొమ్మిది మంది మృతి

పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు.

Terrorist Attack Pakistan : పాకిస్తాన్ లో కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి.. తొమ్మిది మంది మృతి

terrorist attack

Terrorist Attack Pakistan : పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు. దాడిని కరాచీ పోలీస్ చీఫ్ జావెద్ వోదో ధృవీకరించారు. దాడి జరిగిన సమయంలో ఉన్నతాధికారులు కార్యాలయంలో ఉన్నట్లు జావెద్ తెలిపారు.

కరాచీలోని తన కార్యాలయంపై సాయుధులైన ఉగ్రవాదులు దాడి చేశారని.. ఈ దాడిని పోలీస్ పారా మిలిటరీ సమర్థవంతంగా తిప్పి కొట్టారని జావెద్ తెలిపారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కరాచీ పోలీస్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించించిన ఉగ్రవాదులు ముందుగా గ్రనేడ్ తో దాడి చేశారు.

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో చైనా గెస్ట్‌హౌజ్‌పై ఉగ్రదాడి.. ఇద్దరిని కాల్చి చంపిన భద్రతా దళాలు

అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిని భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రతి ఘటించింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది మృతి చెందారు.

గత నెల రోజులుగా పాకిస్తాన్ లో వరుస ఉగ్రదాడులు జరుతున్నాయి. గత నెల(జనవరి) మసీుదులో మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందారు.