Ganja Smuggling : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Ganja Smuggling : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

Ganja Smugglers arrested

Updated On : February 4, 2022 / 12:36 PM IST

Ganja Smuggling :  తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

కేబీఆర్ పార్క్ వద్దగంజాయి చేతులు మారుతోందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి గంజాయి ద్రావణాన్నిపట్టుకున్నారు. ఈ సందర్భంగా డిగ్రీ చదువుతున్న శివశంకర్ అనే వ్యక్తిని, టాక్సీ డ్రైవర్ గా పని చేసే ముస్తఫాలతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలుడ్ని పునరావాస కేంద్రానికి తరలించి నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : NEET PG 2022 : నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా