థాయ్‌లాండ్ టూరిస్ట్‌పై హర్యానాలో గ్యాంగ్ రేప్

థాయ్‌లాండ్ టూరిస్ట్‌పై హర్యానాలో గ్యాంగ్ రేప్

థాయ్‌లాండ్ నుంచి వచ్చిన 41ఏళ్ల టూరిస్ట్ ను హర్యానాలోని హోటల్ మేనేజర్, అతని సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆగష్టు 8న ఘటన జరగ్గా.. నిందితుడైన హోటల్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులపై దర్యాప్తు జరుపుతున్నారు.

‘ప్రధాన నిందితుడు గుల్షన్ ను అతనితో పాటు ఉన్న వ్యక్తిని అరెస్టు చేశాం. మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేయనున్నాం. 376, 342 ఐపీసీ సెక్షన్ల ప్రకారం.. వారిపై పలు కేసులు నమోదుచేశాం. మెడికల్ రిపోర్ట్ త్వరలోనే రావాల్సి ఉంది’ అని ఎస్‌హెచ్ఓ హిసార్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు.

బాధితురాలు ఆగష్టు 6న రెడ్ స్క్వేర్ మార్కెట్ ఏరియాలోని హోటల్ రెజెన్సీలో ఉంటుంది. హోటల్ మేనేజర్ తో పాటు సిబ్బంది కలిసి బలవంతంగా బాధితురాలి గదిలోకి ప్రవేశించి రేప్ చేశారు. బాధితురాలు నిద్రపోతుండగా ఆగష్టు 8 ఉదయం 4గంటలకు గదిలోకి చొరబడినట్లు ఆమె కంప్లైంట్ లో పేర్కొంది.

మహిళ కేకలు పెట్టడంతో జనాలు గుమిగూడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు తన ఫ్రెండ్ తో కలిసి టూరిస్ట్ వీసాపై వచ్చినట్లు తెలిసింది. మార్చిలో ఇక్కడకు వచ్చిన మహిళ వెళ్లడం కుదరకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. కరోనావైరస్ కారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు అవడంతో ఇండియాలోనే ఆగిపోయింది.

బాధిత మహిళ కేవలం థాయ్ భాషలోనే మాట్లాడగలగడంతో ఫిర్యాదు నమోదు చేయడానికి ఆలస్యమైంది. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు గుల్షన్ 25ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు.