Mexico Bus Accident : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం, 27 మంది మృతి

మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు....

Mexico Bus Accident : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం, 27 మంది మృతి

Mexico Bus Accident

Mexico Bus Accident : మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. (Passenger Bus Accident In Mexico) క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా చెప్పారు.

Komatireddy Raj Gopal Reddy : జాక్ పాట్ కొట్టిన కోమటిరెడ్డి.. ఎట్టకేలకు కీలక పదవి

ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. రాత్రివేళ రాజధాని మెక్సికో సిటీ నుంచి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో 80 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని మెక్సికో అధికారి జీసస్ రొమెరో చెప్పారు. ఘాట్ రోడ్డు, లోయలున్న మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ

ఈ రోడ్డు ప్రమాదంపై ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ సాలోమన్ జారా సోషల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెక్సికో దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం సెంట్రల్ స్టేట్ క్వెరెటారోలోని హైవేపై కార్గో వాహనాలతో కూడిన అగ్నిప్రమాదంలో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మే నెలలో పశ్చిమ రాష్ట్రమైన నయారిట్‌లో బస్సు లోయలో పడటంతో 18 మంది మెక్సికన్ పర్యాటకులు మరణించారు. మే నెలలోనే ఈశాన్య రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని హైవేపై ప్యాసింజర్ వ్యాన్ మరియు సెమీ ట్రక్కు ఢీకొనడంతో 13 మంది మరణించారు.