Chapati : ప్రాణం తీసిన చపాతి

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం జరిగిన గొడవలో ఓ కస్టమర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది.

Chapati : ప్రాణం తీసిన చపాతి

Chapathi

Chapati :  ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం జరిగిన గొడవలో ఓ కస్టమర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది. సంభాల్ లో ఖెంపాల్ అనే ట్రాన్స్ పోర్టర్ భోజనం చేయటానికి తనషాప్ కు సమీపంలో ఉండే దాబాకి వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన భోజనాన్ని దాబాలోని బేరర్ ఖెంపాల్ కు ఇచ్చాడు.

భోజనం ఎలా ఉందో చూద్దామని ఖెంపాల్ పార్శిల్ తెరిచి చూశాడు. అందులో చపాతీలు సగం కాలిపోయి, సగం మాడిపోయి ఉన్నాయి. ఖెంపాల్ చపాతీలు మాడిపోయి ఉన్నాయని దాబాలోని కుక్  అనిల్ వద్దకు వెళ్లి చెప్పాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ఖెంపాల్ అక్కడినుంచి తన షాపుకు వెళ్లిపోయాడు.
Also Read : Married Woman Eloped : బంగారం,డబ్బు తీసుకుని లడ్డూ లాంటి ప్రియుడితో పరారైన భార్య
అప్పటికి గొడవ సర్దుమణిగింది. కానీ అనిల్ ఖెంపాల్ పై కోపంతో ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత ఖెంపాల్ షాపు వద్దకు వెళ్లి అతనిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఖెంపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికివచ్చి కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించి నిందితుడు అనిల్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.