Woman Harassing : మహిళ బెదిరింపులతో యువకుడు ఆత్మహత్య

ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్ లో 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు అలీగఢ్ లోని ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అభిషేక్ కుమార్ సక్సేనాగా గుర్తించారు.

Woman Harassing : మహిళ బెదిరింపులతో యువకుడు ఆత్మహత్య

Woman Harassing

Woman Harassing :  ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్ లో 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు అలీగఢ్ లోని  ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అభిషేక్ కుమార్ సక్సేనాగా గుర్తించారు.

సక్సేనా గత వారం రోజులనుంచి యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్నాడు. వారం రోజుల క్రితం తన అద్దె ఇల్లు ఖాళీ చేసివచ్చి యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్నాడు. ఆత్మహత్య చేసుకోటానికి ముందు అతను ఆగ్రాకు  చెందిన ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు.

ఆ మహిళ ఒత్తిడి చేయటం వలనే సక్సేనా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఆమహిళ తన సోదరుడ్ని బ్లాక్ మెయిల్ చేసిందని బాధితుడి సోదరి ఆరోపించింది.  ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు.

బాధితుడి సోదరి  ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు అభిషేక్ సక్సేనాకు యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేనప్పుడు సులేమాన్ హాస్టల్ లోని 100వ నెంబరు గదిలో ఎందుకు నివసిస్తున్నారు   అనే కోణంలో  కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.