Uttarakhand : ప్రేమ వేధింపులు .. మహిళా న్యాయవాది ముక్కు కొరికేసిన సీనియర్ లాయర్

ఓ మహిళా న్యాయవాదిని ప్రేమపేరుతో వేధించాడు ఓ సీనియర్ లాయర్. ప్రేమించాను..పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు. కానీ నాకు అటువంటి ఉద్ధేశం లేదుని తెగేసి చెప్పింది మహిళా న్యాయవాది.అయినా వెంటపడ్డాడు. దీంతో సదరు సీనియర్ లాయర్ ఆ మహిళా న్యాయవాది ముక్కు కొరికేసాడు.

Uttarakhand : ప్రేమ వేధింపులు .. మహిళా న్యాయవాది ముక్కు కొరికేసిన సీనియర్ లాయర్

Women lawyer complained to police senior lawyer bit her nose for refusing love

Uttarakhand : తన వద్దకు ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఓ మహిళా న్యాయవాదిని ప్రేమపేరుతో వేధించాడు ఓ సీనియర్ లాయర్. ప్రేమించాను..పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు. కానీ నాకు అటువంటి ఉద్ధేశం లేదుని తెగేసి చెప్పింది మహిళా న్యాయవాది.అయినా వెంటపడ్డాడు. వేధించాడు. పెళ్లి చేసుకోవాలని పదే పదే వేధింపులకు పాల్పడ్డాడు. అయినా ఆమె పెళ్లికి అంగీకరించాలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన సదరు సీనియర్ లాయర్ ఆ మహిళా న్యాయవాది ముక్కు కొరికేసాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఈ జరిగిన న్యాయం కోసం వాదించాల్సిన లాయరే ఇటువంటి దారుణంపై బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జ్వాలాపూర్ పోలీస్ స్టేషన్ లో నివసించే సదరు బాధితురాలు ప్రస్తుతం రోషనాబాద్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె 2018లో చంద్రశేఖర్‌ అనే ఓ సీనియర్ లాయర్‌ వద్ద ఇంటర్న్‌షిప్‌ చేసింది. అలా ఆరునెలల పాటు అతనివద్దే ఇంటర్నషిప్ చేసింది. ఆ సమయంలో నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాడు చంద్రశేఖర్. కానీ ఆమె మాత్రం మీపై నాకు అటువంటి ఉద్ధేశం లేదని తేల్చి చెప్పింది. ఈక్రమంలో ఆమె ఇంటర్న్ షిప్ పూర్తి కావటంతో రోషనాబాద్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అయినా ఆమెను చంద్రశేఖర్ వదల్లేదు. ప్రేమిస్తున్నానంటూ పదే పదే వెంటపడేవాడు. వేధించేవాడు. అయినా ఆమె కుదరదు అని స్పష్టంగా చెప్పేసింది.

ఈక్రమంలో సోమవారం (మార్చి6,2023) సాయంత్రం కోర్టు ఆవరణలో జరిగిన హోలీ వేడుకలకు బాధితురాలు పాల్గొంది. ఆ వేడుకలకు చంద్రశేఖర్‌ కూడా హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తరువాత ఆమె కోర్టు నుంచి ఇంటికి వెళుతుండగా చంద్రశేఖర్‌ ఆమె స్కూటీని అడ్డుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి చేశాడు. ఇంతకు ముందే మీకు ఆ విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా..పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది. నా వెంటపడి ఇలా వేధించవద్దని హెచ్చరించింది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ విచక్షణ మరిచిపోయాడు. ఆమెపై దాడి చేసి.. ఆమె ముక్కును కొరికేశాడు. దీంతో అతని నుంచి తప్పించుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్ చార్జ్ నరేంద్ర సింగ్ వెల్లడించారు.