Viral Video : కండకావరం.. జాతీయ జెండాతో చికెన్‌ను శుభ్రపరిచిన వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్

Viral Video : చికెన్ షాప్ లో పని చేసే వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రం చేయడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral Video : కండకావరం.. జాతీయ జెండాతో చికెన్‌ను శుభ్రపరిచిన వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్

Viral Video (Photo : Google)

Viral Video : ఓ వ్యక్తి జాతీయ జెండాను అగౌరవపరిచాడు. జాతీయ పతాకంతో చికెన్ ను శుభ్రపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

దాద్రా నాగర్ హవేలీలోని సిల్వస్సాకు చెందిన మహమ్మద్ సైఫ్ ఖురేషీ(21) చికెన్ షాప్ లో పని చేస్తాడు. ఈ క్రమంలో అతడు జాతీయ జెండాతో చికెన్ ను క్లీన్ చేశాడు. దీన్ని అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించాడు. సైఫ్ చర్యను అతడు జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే తన మొబైల్ లో వీడియో తీశాడు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి సైఫ్ పై చర్యలకు తీసుకోవాలని కోరాడు.

Also Read.. YouTuber Arrested: యూట్యూబర్ తిక్క కుదిరింది..! మూడ్నెళ్ల క్రితం బర్త్ డే వేడుకల వీడియో వైరల్.. అరెస్టు చేసిన పోలీసులు

అంతే, వీడియో వైరల్ అయ్యింది. సైఫ్ చర్య పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు భగ్గుమన్నారు. సైఫ్ చేసిన పనిని తప్పుపట్టారు. జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని సీరియస్ అయ్యారు. సైఫ్ చాలా పెద్ద తప్పు చేశాడని, జాతీయ పతాకాన్ని అవమానించిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.(Viral Video)

దీనిపై దుమారం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. జాతీయ గౌరవానికి భంగం కలిగించినందున అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం ఆ వ్యక్తిని జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మున్సిపాలిటీ అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. ఆ చికెన్ షాప్ కి సీల్ వేశారు.

Also Read.. Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్

జాతీయ జెండాను బహిరంగ ప్రదేశంలో లేదా మరేదైనా ప్రదేశంలో కాల్చడం, అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం లేదా తొక్కడం వంటి వాటికి సంబంధించిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్ 2 కింద వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే, అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు వెల్లడించారు.

ఫ్లాగ్ కోడ్ 2002:
ఇండియన్ ఫ్లాగ్ కోడ్, 2002 ప్రకారం, చిరిగిన లేదా దెబ్బతిన్న జాతీయ జెండాను పారవేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దానిని కాల్చడం లేదా పాతిపెట్టడం. ఏదైనా విధానాన్ని ఎన్నుకునేటప్పుడు కఠినమైన నియమాన్ని కూడా అనుసరించాలి. ఈ నియమాలు కింది విధంగా తెలియజేయబడ్డాయి.(Viral Video)

కోడ్ ఇలా చెబుతోంది:
“జాతీయ జెండాను పాతిపెట్టడానికి, దెబ్బతిన్న జెండాలన్నింటినీ చెక్క పెట్టెల్లో సేకరించి, వాటిని మడతపెట్టి, వాటిని సరిగ్గా ఉంచాలి. పెట్టెను భూమిలో పాతిపెట్టాలి. జెండాను పాతిపెట్టిన తర్వాత కొద్దిసేపు మౌనం పాటించాలి.

జెండాను దహనం చేయడం మరొక ఎంపిక:
సురక్షితమైన స్థలాన్ని ఎంచుకుని దానిని శుభ్రం చేసి, జెండాను మడిచి, మంట వెలిగించి, జెండాను మంట మధ్యలో జాగ్రత్తగా ఉంచండి. జాతీయ జెండాను సరిగ్గా మడవకుండా దహనం చేయడం లేదా ముందుగా కాల్చివేసి తర్వాత మంటల్లో వేయడం కూడా నేరపూరిత చర్య.