Supreme Court: అతీక్, అష్రఫ్‌లను ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు? పోలీసులకు సుప్రీం ప్రశ్నలు
తనను ఎన్కౌంటర్ చేస్తారని గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి తీసుకువచ్చే సమక్షంలోనే మీడియా ముందు అతీక్ అహ్మద్ వాపోయాడు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు కుమారుడు అసద్ సహా కొందరు అనుచరులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

Why did Atiq and Ashraf get carried away ask SC to UP Police
Supreme Court: పోలీసు వలయంలో ఉన్న మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ సహా, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లు మీడియా కెమెరాల ఎదుటే అతిదారుణ హత్యకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై యూపీ పోలీసులను సుప్రీం కోర్టు శుక్రవారం పలు ప్రశ్నల్ని సంధించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రికి నడిపించుకుంటూ ఎందుకు తీసుకెళ్లారు? ఆస్పత్రి ముఖద్వారం వరకూ అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు? మీడియా ఎదుట పరేడ్‌గా ఎందుకు తీసుకెళ్లారనీ కోర్టు ప్రశ్నించింది.
Tej Pratap Yadav: ఆనందం పట్టలేక సైకిల్ తొక్కుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ రయ్ రయ్..
ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ డివిజనల్ ఆస్పత్రికే అతీక్, అష్రఫ్‌లను తీసుకువెళతారని హంతకులకు ఎలా తెలుసని కూడా కోర్టు ప్రశ్నించింది. హత్యలన్నీ ఓ పథకం ప్రకారం జరిగాయా? అన్న కోణంలో విచారించాల్సిందిగా తాము కమిషన్‌ను కోరతామని పేర్కొంది. ఈ ప్రశ్నలన్నింటికీ వివరణ ఇవ్వాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. రోజుల వ్యవధిలోనే అతీక్, అష్రఫ్, అసద్, వారి సహచరుల కాల్చివేతకు సంబంధించి తీసుకున్న చర్యల్ని వివరిస్తూ మూడు వారాల్లోపు సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Gurugram: భార్యను కిరాతకంగా హతమార్చి సాక్ష్యాలు దాచేసిన హంతకుడిని పట్టించిన ప్లాస్టిక్ బ్యాగు
2020లో యూపీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంపై సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ చౌహాన్ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యల్ని వివరించాల్సిందని కూడా యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి తనను ఎన్కౌంటర్ చేస్తారని గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి తీసుకువచ్చే సమక్షంలోనే మీడియా ముందు అతీక్ అహ్మద్ వాపోయాడు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు కుమారుడు అసద్ సహా కొందరు అనుచరులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.