Tej Pratap Yadav: ఆనందం పట్టలేక సైకిల్ తొక్కుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ రయ్ రయ్..

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ అంతగా ఆనందపడడం వెనుక కారణం ఏంటీ?

Tej Pratap Yadav: ఆనందం పట్టలేక సైకిల్ తొక్కుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ రయ్ రయ్..

RJD leader Tej Pratap Yadav

Updated On : April 28, 2023 / 7:57 PM IST

Tej Pratap Yadav: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చారు. ఆ సమయంలో లాలూ భార్య రబ్రీ దేవి (Rabri Devi), వారి కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కూడా ఆయనతోనే ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను సహాయకులు వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువచ్చారు.

తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరిటి పట్నాకు వచ్చిన ఆనందంలో ఆర్జేడీ నేత, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ పై చక్కర్లు కొట్టారు. “మా నాన్న మళ్లీ పట్నాకు వచ్చినందుకు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. అందుకే సైకిల్ తొక్కుతున్నాను. సైకిల్ నడిపిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నాను” అని చెప్పారు.

కాగా, గతంలోనూ పలుసార్లు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ సైక్లింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2018 జులైలో ఇటువంటి కార్యక్రమంలోనే పాల్గొని సైకిల్ తొక్కుతూ ఎదురుగా వచ్చిన టర్న్‌ వద్ద పడిపోయారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ మళ్లీ సైకిల్ తొక్కుతూ కనపడడంతో అప్పటి వీడియోను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి వేషం వేశారు. తన తమ్ముడు తేజస్వీ యాదవ్ కు తాను శ్రీ కృష్ణుడిలా బోధనలు చేస్తానని అన్నారు. తన తమ్ముడిని అర్జునుడిగా అప్పట్లో అభివర్ణించారు.

 

Wrestlers vs WFI: మల్లయుద్ధంలోనే కాదు.. ధర్మయుద్ధంలోనూ అదే కసి.. అదే పట్టుదల..