Wrestlers vs WFI: మల్లయుద్ధంలోనే కాదు.. ధర్మయుద్ధంలోనూ అదే కసి.. అదే పట్టుదల..

Wrestlers: ఓటమి ఎదురైతే ఏడుస్తూ కూర్చేనే పిరికివారు కాదు వాళ్లు. ఎదుట నిలబడి ఉన్నది ఎంతటి బలవంతుడైనా సరే వారిని "కిందపడేసి" గెలవాలన్న కసి అణువణువునా ఉన్నవారు వారు. రెజ్లింగ్ రింగులోనే కాదు.. తమ క్రీడాస్ఫూర్తిని న్యాయం కోసమూ ప్రదర్శిస్తామని నిరూపిస్తున్నారు. జంతర్ మంతర్ నే రెజ్లింగ్ రింగులా చేసుకుని యుద్ధం చేస్తున్నారు.

Wrestlers vs WFI: మల్లయుద్ధంలోనే కాదు.. ధర్మయుద్ధంలోనూ అదే కసి.. అదే పట్టుదల..

Wrestlers vs WFI

Wrestlers: భారత పురాణేతిహాసాలు చదివిన వారికి మల్లయుద్ధం (Wrestling) అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మహాభారతంలోని భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన కుస్తీ. ధర్మం కోసం మల్లయుద్ధం చేసి ఆ భీకర పోరాటంలో జరాసంధుడిని భీముడు సంహరిస్తాడని హిందువులు విశ్వసిస్తారు. ఇప్పటి యువతకు అదే మల్లయుద్ధం (Wrestling) అంటే మొదటగా గుర్తుకు వచ్చేది వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా… వీరూ ఇప్పుడు పోరాడుతున్నారు.

రెజ్లింగ్ రింగులోనే కాదు.. న్యాయం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న పోరాటంలో తమకు ఎదురయ్యే ఎంతటి వారినైనా పడగొట్టేస్తామంటున్నారు. తాము పోరాడుతున్నది దేశాన్ని పాలిస్తోన్న పార్టీకి చెందిన నేత అయినా సరే… తమ ఎదుట నిలిచి ఉన్నది తమ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ అయినా సరే వెనక్కుతగ్గబోమని స్పష్టం చేస్తున్నారు.

మల్లయుద్ధంలోనే కాదు.. ధర్మయుద్ధంలోనూ అదే కసి.. అదే పట్టుదల కనబర్చుతున్నారు. క్రీడా స్ఫూర్తి అలవర్చుకున్నామని, భవిష్యత్తు తరాల క్రీడాకారులనూ ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేయాలని అనుకుంటే భయపడిపోయేలా బుద్ధి చెబుతామంటున్నారు.

ఇంత సీరియస్ కేసు.. అయినా..

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో ఓ మైనర్ కూడా ఉందని చెబుతున్నప్పటికీ, ఈ కేసులో ఇంటి సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ, హాయిగా తప్పించుకుతిరుగుతున్న నిందితులకు బుద్ధి చెప్పాలన్న కసిని కనబర్చుతున్నారు రెజ్లర్లు. అందుకే, దేశానికి అంతర్జాతీయ వేదికపై ఎన్నో పతకాలు సాధించి పెట్టిన రెజ్లర్లు ఢిల్లీలో మళ్లీ ఆందోళనకు దిగారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు ఎదురవుతున్న వేధింపులపై యుద్ధం మొదలు పెట్టారు. ఆ యుద్ధాన్ని విజయంతోనే ముగిస్తామంటున్నారు. న్యాయం చేస్తామని చెప్పడం కాదు.. చేసి చూపించే వరకు తమ ధర్మ యుద్ధం ఆగదని అంటున్నారు.

WFI చీఫ్ పై కేసు పెడతామన్నప్పటికీ..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ పై కేసు పెడతామని పోలీసులు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెప్పినప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసే వరకు జంతర్ మంతర్ నుంచి కదిలే ప్రసక్తే లేదని రెజ్లర్ బజరంగ్ పూనియా ఇవాళ మీడియాకు చెప్పారు. రోజు ఉదయాన్నే జంతర్ మంతర్ వద్దే రెజ్లర్లు వ్యాయామలు చేస్తున్నారు. అక్కడే ఆహారం తింటున్నారు. పీటీ ఉషలాంటి వారి నుంచి మద్దతు రాకున్నా, తమను ఎవరేమి చేసినా అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేస్తున్నారు.

Wrestlers: రెజ్లర్ల దెబ్బ అంటే అది మరీ.. ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకున్నారు.. అసలు ఆట ఇప్పుడు షురూ