Wrestlers: రెజ్లర్ల దెబ్బ అంటే అది మరీ.. ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకున్నారు.. అసలు ఆట ఇప్పుడు షురూ

Wrestlers: రెజ్లర్ల పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. పోలీసులు కదిలారు.

Wrestlers: రెజ్లర్ల దెబ్బ అంటే అది మరీ.. ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకున్నారు.. అసలు ఆట ఇప్పుడు షురూ

Wrestlers

Wrestlers: రెజ్లర్ల పోరాటం ఫలిస్తోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై ఇవాళ కేసు నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని టాప్ రెజ్లర్లు దాదాపు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

మొదట న్యాయం చేస్తామని హామీ చెప్పి, ఇప్పటికీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించలేదు రాజకీయ నాయకులు. దీంతో రెజ్లర్లు పట్టువదలకుండా మళ్లీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సారి విఘ్నేశ్ ఫొగట్, ఓ మైనర్ తో పాటు ఆరుగురు రెజర్లు సుప్రీంకోర్టు (Supreme Court) లో రిట్ పిటిషన్ వేశారు.

సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. పోలీసులు కేసు నమోదు నమోదు చేయట్లేదని సుప్రీంకోర్టుకు రెజ్లర్లు చెప్పారు. దీంతో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసు పంపింది. “అంతర్జాతీయంగా భారత్ కు ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు పిటిషన్ వేశారు. వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కోర్టు పరిశీలనలోకి తీసుకుంటుంది” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

చివరకు పోలీసులు కదిలారు. సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఇవాళే కేసు నమోదు చేస్తామన్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తో పాటు పలువురు ట్రైనర్ల నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని కొందరు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఆ రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉంది.

Wrestlers Protest : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. నీరజ్ చోప్రా ట్వీట్