MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.. నన్నేకాదు చాలామందిని..: యువతి

ఎంతపోరాటం చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశానని చెప్పింది. అంతేకాదు...

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.. నన్నేకాదు చాలామందిని..: యువతి

MLA Durgam Chinnaiah

MLA Durgam Chinnaiah – BRS: తెలంగాణలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య తనను మూడు నెలలుగా వేధిస్తున్నారంటూ ఓ యువతి పలు వివరాలు తెలిపింది. చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తున్న ఆమె మూడు రోజుల క్రితం తెలంగాణ భవన్ (Telangana Bhavan) పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, ఆమె మాట్లాడుతూ… ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, అన్ని ఆధారాలున్నాయి అయినా ఎవరూ కేసు తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే అనుచరులు ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. నన్నేకాదు చాలామందిని వేధించారు. అధికార బలంతో బయటకురాకుండా అడ్డుకుంటున్నారు.

బెల్లంపల్లిలో ఒకసారి దాడికి పాల్పడ్డారు. మా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని మాకు ఇచ్చి మోసం చేశారు. దళిత బంధు రూపంలో మరో స్కాం చేయాలనీ చూశారు. పనులు చేయించుకోవాలంటే అమ్మాయిలను పంపాలంటూ డిమాండ్ చేసేవారు. ఢిల్లీలో కూడా మాకు న్యాయం జరగకుండా దుర్గం చిన్నయ్య చేస్తున్నారు.

ఎంతపోరాటం చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశా. వాళ్లే చేస్తున్న ప్రచారం చూస్తుంటే చనిపోయాక కూడా న్యాయం జరగకపోయేదనే అనిపిస్తుంది. ఎమ్మెల్యే మనుషులకు వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచి జరుగుతుందనే ఎమ్మెల్యే అనుచరులకు వాటాలు ఇచ్చాము.

ఎమ్మెల్యే చేసిన చాట్ ను బయటపెడితే అది ఆయన నంబర్ కాదని చెప్పారు. కానీ, అదే నంబర్ వాడుతున్నారు. మాకు న్యాయం జరిగేంతవరకు ఢిల్లీ వదిలేదిలేదు. మా వెనుక ఏ పార్టీవాళ్లూ లేరు. మేము ఎవరినీ మోసం చేయలేదు. ఎమ్మెల్యే ప్లాన్ లో భాగంగానే రైతులతో కేసులు పెట్టించారు” అని ఆమె చెప్పింది.

YS Sharmila : కవిత అరెస్ట్ ఎప్పుడు? కారు, కమలం రెండూ ఒక్కటే..!- వైఎస్ షర్మిల